Health Benefits : శరీరానికి పోషకాలు అందించే డ్రైఫ్రూట్స్ లో జీడిపప్పు ఒకటి. జీడిపప్పును ఎన్నో రకాల ఆహార పదార్థాల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు . జీడిపప్పులో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. జీడిపప్పులో సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి.. ఇందులోని రాగి మీ మెదడు, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. విటమిన్ కే.. రక్తం గడ్డకట్టే అవసరాలను తీరుస్తుంది. కాల్షియం.. ఎముకల, దంతాల దృఢత్వాన్ని కాపాడుతుంది.జీడిపప్పులో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినైల్స్, కెరోటినాయిడ్స్ లాంటివి ఉన్నాయి.
Health Benefits : ఎంతో మేలు చేసే జీడిపప్పు..
ఎముకలు, మెదడుకు మేలు చేకూర్చే పోషకాలైన రాగి, మెగ్నీషియం, యాంటిఆక్సిడెంట్లు లాంటివి కూడా ఇందులో ఎక్కువే. తక్కువ మోతాదులో తీసుకుంటే బరువు తగ్గడానికి కూడా ఇవి తోడ్పడతాయి. గుండే ఆరోగ్యానికి మంచిది. జీడిపప్పు ఆరోగ్యకర రీతిలో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొవ్వు శాతం తగ్గించేందుకు తోడ్పడతాయి. ఓ పరిశోధన ప్రకారం రోజుకు కొన్ని జీడిపప్పులను తీసుకోవడం వల్ల ఉబకాయం, టైప్-2 డయాబెటిస్ తగ్గుతుందట. వేయించిన జీడిపప్పులు రోజూ తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ తగ్గుతుందట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఇవి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీడిపప్పు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీడిపప్పు తినడం వల్ల ముడతల సమస్య తొలగిపోతుంది.

విటమిన్ ఇ, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు జీడిపప్పులో ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని అనేక సమస్యల నుంచి కాపాడతాయి. శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి మీరు అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇటువంటి మూలకాలు జీడిపప్పులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని బలంగా మారుస్తాయి. జీడిపప్పు ఫైబర్‌కు మంచి మూలం. దీని వినియోగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీడిపప్పు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య, మలబద్ధకం కూడా తగ్గుతాయి. జీడిపప్పులో జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. రోజూ జీడిపప్పు తినడం వల్ల జుట్టు మృదువుగా, ఒత్తుగా మారుడంతోపాటు మెరుస్తుంది. కిడ్నీ ఆకృతిలో కనిపించే జీడిపప్పును ప్రతి రోజు పది చొప్పున నాన బెట్టుకుని.ఉదయం లేవగానే తింటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.అలాగే నేటి కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు.