Health Benefits : కొత్తి మీర లేకుండా ఏ కూర ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కొత్తి మీర తప్పక ఉంటుంది. ఇది రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తి మీర వాసన కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కొత్తిమీర లేకుండా కూర వండుకోరు. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం, కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. మీరు ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్తిమీర నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
Health Benefits : ఉపయోగాలు అదుర్స్..
కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్ ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. అంతర్జాతీయంగా వాడే కొత్తిమీర అనేది… కొరియాండ్రమ్ సాతివమ్ జాతికి చెందిన మొక్క. దీన్ని చైనీస్ పార్స్‌లీ మొక్క అని కూడా అంటారు. చాలా మంది కొత్తిమీరను బయట కొనుక్కుంటారు. కానీ..ఇసుకలో ఓ 20 ధనియాల గింజలు వేస్తే చాలు… రోజూ 10 చుక్కలు నీరు పోసినా చాలు…

ఆటోమేటిక్‌గా కొత్తమీర మొక్కలు వచ్చేస్తాయి. 15 రోజుల్లో చక్కటి ఫ్లేవర్ ఇచ్చే కొత్తిమీర పెరుగుతుంది. కొత్తిమీర మంచి భావాన్ని కలిగించటమే కాకుండా, మంచి అనుభవాన్ని కలుగజేస్తుంది. దీనిలో ‘ఎసేన్షియాల్ ఆయిల్స్’ ఉండటము వలన తలనొప్పి, మానసిక అలసటను మరియు టెన్సన్స్’ను తగ్గించుటలో ఉపయోగపడును. కొత్తిమీర ఎక్కువగా తీసుకోవడం వలన ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించును. కొత్తి మీర యాంటీ-ఆక్సిడెంటట్స్ ఉండటం వలన కీల్లనోప్పులను తగ్గించటమే కాకుండా, రుచిని పెంచును.