Health Benefits : వర్షాకాలంలో మనకు మొక్కజొన్న సమృద్ధిగా దొరుకుతుందన్న విషయం తెలిసిందే. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కానీ మొక్కజొన్న తినడం వల్ల బరువు తగ్గుతారా పెరుగుతారా అనే విషయం చాలామందికి తెలియదు. అసలు విషయం ఏంటంటే బరువు తగ్గడంలో మొక్కజొన్న చాలా ఉపయోగపడుతుంది. మొక్కజొన్నలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మొక్కజొన్న బరువును పెంచుతుందని సాధారణంగా అందరు అనుకుంటారు. కానీ ఇది బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా ప్రయోజనాలు మొక్కజొన్న తినే విధానం ఎలా అనేది చూస్తే.. అల్పాహారంలో మొక్కజొన్న చేర్చవచ్చు.
ఉడకబెట్టి లేదా కాల్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిది. నూనెలో వేయించడం, నెయ్యిలో వేయించడం వంటివి చేయకూడదు. ఇది అతిగా తిన్నా కూడా హానికరం అనే చెప్పాలి, మొక్కజొన్న చాలా శక్తిని అందిస్తుంది. దీని కారణంగా మళ్లీ మళ్లీ ఆకలి వేయదు. ప్రొటీన్ సమృద్ధిగా.. మొక్కజొన్న నుంచి తగినంత పరిమాణంలో ప్రోటీన్ లభిస్తుంది. . మొక్కజొన్నలో విటమిన్లు ఉంటాయి, అలానే విటమిన్ బి కాంప్లెక్స్ ఇందులో మంచి పరిమాణంలో ఉండడం వలన ఇది జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువును తగ్గేలా చేస్తుంది. గర్భిణులు మొక్కజొన్న తినడం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బిడ్డపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. గర్భిణులు ఎక్కువగా అస్సలు తినకూడదు.

అందులోనూ ఏవి తినాలి? ఏవి తినకూడదు అన్న విషయాలను కూడా తెలుసుకోవాలి. అయితే కొంతమంది గర్భిణులు మొక్కజొన్నను తినాలని.. మరికొంతమంది తినకూడదని చెప్తుంటారు. సాధారణంగా గర్భిణీలు మొక్కజొన్నను తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాని ప్రగ్నెన్సీ సమయంలో ఏదైనా ఇతర సమస్య ఉంటే మాత్రం మొక్కజొన్నకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సలహానిస్తున్నారు. మొక్కజొన్నలో విటమిన్ బి1, విటమిన్ బి5, విటమిన్ సి, ఖనిజాలు, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలో పోషకాలు ఎక్కువగా ఉండటం వలన ఇది రుచిగా కూడా ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు దీన్ని తినాలనిపిస్తే ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. అయితే దీనిని తినే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.