Health Benefits : మన ఇంటి పరిసరాలలో మునగ చెట్టు తప్పక ఉంటుంది. మునక్కాయ లేదా మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. మునగ అనేది భారతదేశానికి సంబంధించిన మొక్క. జానపద ఔషధాలలో శతాబ్దాలుగా ఈ మొక్క ఆకులు, పువ్వులు, విత్తనాలను ఉపయోగిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అవి మధుమేహం, దీర్ఘకాలిక మంట, బాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కీళ్ళ నొప్పి, గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్, అధిక రక్త పోటు, ఔషధాల వల్ల కాలేయం దెబ్బతినడం, కడుపు పూతలు, ఆస్తమా, గాయం మాన్పుట, వ్రణోత్పత్తి నిరోధించడానికి, పెద్దప్రేగు కాన్సర్, అతిసారం వంటి రోగాలను నయం చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మునగాకులో చాలా ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు ఉన్నాయి. ఇవి మీ శరీరాన్ని నయం చేయడానికి, కండరాలను నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మునగాకు ద్రవం వాపు, ఎరుపు , నొప్పిని తగ్గిస్తుంది. మునగాకులో కనిపించే ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. కీమోథెరపీ మెరుగ్గా పని చేయడంలోను ఇది ఎంతగానో దోహద పడుతుంది. కొంతమంది నిపుణులు మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ఆరోగ్యాన్ని ప్రోత్సహించే రసాయనాలు మెదడులో ఒత్తిడిని, మంటను నయం చేస్తాయని భావిస్తున్నారు.

Health Benefits : ఇన్ని ఉపయోగాలా?
మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును వాడతారు. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు. థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి