Fennel Seeds : సోంపుతో చాలా ప్ర‌యోజ‌నాలు.. అవేంటో తెలుసా?

Advertisement

Fennel Seeds : ఒక‌ప్పుడు చాలా మంది సోంపుని భోజనం త‌ర్వాత త‌ప్ప‌క తీసుకునే వారు. ఇప్పుడు రెస్టారెంట్‌కి వెళితే అప్పుడు వారు చివ‌రలో ఇస్తున్నందున కొంద‌రు తింటున్నారు. అయితే సోంపు వ‌ల‌న చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌నే సంగ‌తి మీకు తెలుసా? సోంపును కూరల్లో, స్వీట్స్‌లో కూడా వేస్తారు. వీటిని రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సోంపు గింజలను నీటిలో నానబెట్టి.. ఆ నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. వాటిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఆత‌ర్వాత తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ ఉదయం, సాయంత్రం తాగినా శరీరంలో కొవ్వు ఈజీగా కరుగుతుంది.

Advertisement

లేదంటే పొడి మాదిరిగా చేసుకొని అని అయిన తీసుకోవ‌చ్చు. గుప్పడు సోంపు గింజలు తీసుకుని పొడి చేసుకోవాలి. ఈ సోంపు పొడిలో నల్ల ఉప్పు, ఇంగువ, పటికబెల్లం పొడి కలిపితే దానిలోని పోషక విలువలు ఇంకా పెరుగుతాయి. భోజనం తర్వాత గోరువెచ్చని నీటితో ఒక చెంచా పొడిని కలుపుకుని ప్ర‌తి రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో సోంపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరంలో అధికంగా ఉన్న నీటి నిల్వను తగ్గిస్తుంది. మూత్ర మార్గ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Advertisement
health benefits of fennel seeds uses
health benefits of fennel seeds uses

Fennel Seeds : చాలా ప్రయోజ‌నాలు..

సోంపు విత్తనాలు అజీర్ణం, పొట్ట ఉబ్బరం మరియు మలబద్దక నివారణకు కూడా ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి .సోంపు గింజలలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ సైనస్ గ్రంధులను క్లియర్ చేయడానికి సహాయపడతాయి. సోంపు గింజలు ఉబ్బసం లక్షణాలను తగ్గిస్తాయి. మీ కంటి చూపుకు సోంపు గింజలు అద్భుతంగా పని చేస్తాయి. ఈ గింజల్లో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటి చూపుకు ముఖ్యమైనది . మీరు సరిగ్గా నిద్రపోకపోతే సోంపును తప్పక తినాలి. వాస్తవానికి మెలటోనిన్ అనే హార్మోన్ మంచి నిద్రకు కారణం. సోంపు మెలటోనిన్ స్రవించడానికి పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. కొంతమంది మహిళలు పీరియడ్స్‌లో భరించలేని నొప్పిని అనుభవిస్తారు. అలాంటి మహిళలు సోంపు నీరు తాగితే నొప్పి త‌గ్గుతుంది.

Advertisement