Health Benefits : ద్రాక్ష పండ్లు ఎక్కువ తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు..!

Advertisement

Health Benefits : ద్రాక్ష పండ్ల‌ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇందులో ప‌లు ర‌కాలు ఉన్నాయి. తెల్ల ద్రాక్ష రుచిక‌రంగా ఉన్న‌ప్ప‌టికీ, న‌ల్ల ద్రాక్ష కాస్త పులుపు ఉంటాయి. ఇక ద్రాక్ష‌లో సీడ్‌లెస్ ద్రాక్ష కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. శీతాకాలంలో ఇవి విరివిగా ల‌భిస్తాయి. ఇందులో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినడం కూడా అంత మంచిది కాదు. గ్రేప్స్‌ని అధిక మోతాదులో తీసుకుంటే బరువు పెరుగుతారు. పరిమితంగానే ఈ పండ్లను తింటే మ‌న ఆరోగ్యానికి మంచిది. మూత్రపిండవ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారు ద్రాక్షకి దూరంగా ఉండ‌డం మంచిది.

Advertisement

ద్రాక్షను ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే అవకాశం ఉంది. అలానే డయాబెటిస్ సమస్యలు కూడా మరింత పెరుగుతాయి. ద్రాక్షలో కేలరీల పరిమాణం చాలా ఎక్కువ. ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కాపర్ మరియు విటమిన్-కె, థయామిన్ కూడా ద్రాక్షలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఎక్కువ ద్రాక్ష తినడం వల్ల శరీర బరువు పెరుగుతారు. ద్రాక్షలో బలమైన పాలీఫెనాల్స్ ఉన్నాయి. వీటి వల్ల పుట్టబోయే బిడ్డలో ప్యాంక్రియాటిక్ సమస్యలు కనిపించ‌డం జ‌రుగుతుంది. అందువల్ల గర్భధారణ సమయంలో ద్రాక్షను తీసుకునేటప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.

Advertisement
Health Benefits of Grapes uses
Health Benefits of Grapes uses

Health Benefits : మంచి ఉప‌యోగాలు..

ద్రాక్ష పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ డీ, విటమిన్ కే, విటమిన్ బీ6, విటమిన్ బీ12, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం లాంటి విటమిన్స్ , మినరల్స్ ఉన్నాయి. వీటి వ‌ల‌న మ‌న ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది.ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వీటిని తరచూ తినడం వల్ల గుండెకు కూడా మేలు చేస్తాయి. ద్రాక్ష పండ్లు తినడం వల్ల బీపీలు కంట్రోల్ లో ఉంటాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబ‌ట్టి సోడియంలోని నెగిటివ్ ని ఎలిమినేట్ చేస్తుంది. దాని వల్ల హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది. కంటిలోనే రెటీనాను కాపాడుకోవడానికి కూడా ద్రాక్ష పండ్లు సహాయం చేస్తాయి. రెటీనాకి ఎక్కువ ప్రోటీన్స్ అందించడానికి ద్రాక్ష సహాయం చేస్తాయి.

Advertisement