Health Benefits : నిమ్మ ఆకులను వాసన చూడటం వలన ఇన్ని ప్రయోజనాల…!

Advertisement

Health Benefits : నిమ్మకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదని మనకు తెలుసు. అలాగే నిమ్మ ఆకులను వాసన చూడటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వివరాల్లోకెళ్తే నిమ్మకాయలు విటమిన్ – సి సమృద్ధిగా కలిగి ఉంటాయి.అలాగే ప్రతిరోజు నిమ్మరసం తాగడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని మనకు తెలుసు. నిమ్మకాయల లాగానే నిమ్మ ఆకులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. నిమ్మ ఆకులను తినడం లేదా వాసన చూడడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ ఆకులలో ప్రోటీన్ , ఐరన్ ,కాల్షియం విటమిన్ ఏ మరియు సిట్రిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉన్నాయి.

Advertisement

తాజాగా NCBI అధ్యయనం ప్రకారం నిమ్మ ఆకుల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్ళను ఏర్పడకుండా నిరోధిస్తాయి .ఇవి కిడ్నీలో రాళ్ళను పోగొట్టడంలో ఔషధంలా పనిచేస్తాయి. అలాగే మైగ్రేన్ తో బాధపడే వారికి నిమ్మ ఆకులు చాలా మేలు చేస్తాయని ఒక అధ్యయనంలో తేలింది.నిమ్మ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి మైగ్రేన్ ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ నిమ్మ ఆకులను వాసన చూడటం వలన నిద్రలేమి దూరం అవుతుంది.అలాగే నిమ్మ ఆకులలో ఉండే క్రిమి సంహారక గుణాలు కడుపులోని నులిపురుగులను చంపడానికి పనిచేస్తాయి.

Advertisement
Health Benefits of lemon leaves
Health Benefits of lemon leaves

అలాగే స్నానం చేసేటప్పుడు నీటిలో నిమ్మ ఆకులను వేసుకొని స్నానం చేయడం వలన చర్మ సమస్యలకు తక్కువగా గురవుతారు. అలాగే నిమ్మ ఆకులు బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. నిమ్మ ఆకులను టీలో వేసుకుని లేదా వేడి నీటిలో మరిగించి తాగడం వలన త్వరగా బరువు తగ్గుతారు. ఇలా ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కాని వీటిని డైరెక్ట్ గా తీసుకోకూడదు.నిమ్మ ఆకులను వేడి నీటిలో మరిగించి లేదా నిమ్మ ఆకు రసాన్ని టీలో వేసుకొని తాగాలి. గమనిక : పైన పేర్కొన్న వివరాలు ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ఆధారంగా రాసినవి. ఇవి కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Advertisement