Health Benefits : మన వంటింట్లో ఉండే పోపు గింజలలో ఆవాలు కూడా ఒకటి. అవి చూడడానికి చాలా చిన్నగా ఉన్నా వాటి వలన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పంటి నొప్పితో బాధపడే వారికి ఆవాలు దివ్య ఔషదంగా పని చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో కాసిన్ని ఆవాలు వేసి.. ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంపై ఏర్పడే కురుపులు, దురదలకు ఆవ పొడితో తగ్గించుకోవచ్చు. ఆవ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి. చర్మంపై ఏర్పడే పులిపిర్లను తొలగించడానికి కూడా ఆవ పొడి బాగా పనిచేస్తుంది. ఆవ పొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆవాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటి ఆకులలో కాల్షియం, రాగి, విటమిన్లు సి, ఎ, కె అధికంగా ఉంటుంది. ఆవ ఆకులను బచ్చలికూర మాదిరిగానే వండుకోవచ్చు. ఇది రుచికరంగానే ఉంటుంది. ఆవ గింజల్లో ఉండే ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవ గింజలను నానబెట్టి, మరుసటి రోజున ఆవాలను పేస్ట్ చేసి దానిని గోరువెచ్చని పాలలో వేసుకుని తాగవచ్చు. అదీ కుదరకపోతే భోజనం తినే సమయంలోనైనా దానిని తీసుకోవచ్చు. ఆవాలు శరీరంలో క్యాన్సర్ వ్యాప్తిని నిలువరిస్తుంది.

Health Benefits : వాటికి చెక్ పెట్టొచ్చు..
ఆవాలలోని గ్లూకోసినోలేట్లు క్యాన్సర్ కణాలను చంపేయడమే కాకుండా శరీరంలో క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. చాలా మంది వ్యక్తులు ఆవపిండిని తినడాన్నిసురక్షితం అని భావిస్తుంటారు. అయితే ఆవపిండి తినడం వలన ఆరోగ్యంతో పాటు దుష్ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆవ పిండిని అతిగా తింటే.. కడుపు నొప్పి, విరేచనాలు, గట్ ఇన్ఫ్లమేషన్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఆవాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన ఇవి అంటు వ్యాధుల నివారణా చికిత్సలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడే ఆరోగ్యకరమైన రోగనిరోధక కణాల అభివృద్ధికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.