Health Benefits : ప్రస్తుత పరిస్థితులకి అనుగణంగా ప్రజలు తమ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటున్నారు. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో పాత కాలం తిండి తింటున్నారు. మన పూర్వీకుల జావను తయారు చేసుకుని తాగేవారు. మొదట్లో జవాల వాడకం తక్కువగా ఉన్నా.. ఈ మధ్య కాలంలో వీటి ప్రాధాన్యత ఎక్కువైంది. ఫుడ్ తినాలని అనిపించినప్పుడు రాగిజావ తయారు చేసుకోవడం ఎంతో ఉత్తమం. రాగిజావను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి. ఉల్లి, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు. ముందుగా రెండు చెంచాలు రాగిపిండిని కప్పులో తీసుకొని అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
కొద్దిగా మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇష్టమైన వాళ్లు కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయల ముక్కలు వేసుకుని దింపేయాలి. అందులో పెరుగు కలుపుకొని తాగితే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒక వేళ రాగిజావ కాస్త తియ్యగా చేసుకోవాలంటే రాగి పిండిలో బెల్లం ముక్క వేసుకుని అరగ్లాసు పాలు కలిపి ఉడికించుకొని తాగిన బాగుంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఏ,బీ,సీ ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీని వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో రాగి జావ ఎంతో ఉపయోగపడుతుంది. కాల్షియం సప్లిమెంట్ తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.

Health Benefits : ఆరోగ్యానికి మంచిది..
వయస్సు పెరగిన వారు, చిన్న పిల్లలు ఈ రాగిజావని తాగడం మంచిది. రాగుల పై పొరలో మిగిలిన ధాన్యాలకంటే ఎక్కువ పాలిఫినాల్స్ ఉంటాయి. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుతగుణాలు దాగి ఉన్న నేపథ్యంలో ఇప్పటి వారు ఇది తప్పక తీసుకుంటున్నారు. రోజూ ఉదయాన్ని రాగి జావ తాగితే చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. రాగులను ఉప్మాలా చేసుకోని తిన్నా.. శరీరానికి అధిక బలం చేకూరుతుంది. మొలకెత్తిన రాగులు తిన్నా మేలే. ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగులల్లో లభిస్తాయి.