Health Benefits : భారతీయులు తమ వంటకాలలో పసుపుని తప్పక వాడతారు అనే విషయం తెలిసిందే. కూరల్లో పసుపును కేవలం రుచి కోసమే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడి, మనల్ని క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. అజీర్తి, గుండెల్లో మంట, డయాబెటిస్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి వ్యాధులపై పసుపు ఔషధంగా పని చేస్తుంది. . పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ , యాంటిక్యాన్సర్ వంటి లక్షణాలు ఉన్నాయి.అందుకే పసుపును సౌందర్య లేపనంగా కూడా వాడుతుంటారు. పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడే శక్తి కలిగి ఉంటుందని తెలుస్తుంది. క్యాన్సర్ కణాల విస్తరణను కూడా పసుపు నిరోధిస్తుంది.
పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ ఉండడంతో ఇది ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. పసుపులో కర్కుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ చికిత్సకు ఎంతగానో సహాయపడుతుంది. నిత్యం మనం పసుపు తీసుకోవడంతో జీర్ణక్రియ మెరుగుపడడమే కాక… పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాల కారణంగా గాయాలు , దీర్ఘకాలిక వాపు కారణంగా కలిగే నొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కార్డియోటాక్సిసిటీ, డయాబెటిస్ సంబంధిత గుండె సమస్యలను నివారిస్తాయి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అన్నవాహికలో కలిగే మంటను తగ్గిస్తాయి.

Health Benefits : పసుపుతో బహు ప్రయోజనాలు..
ఇది ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, కాలేయ వ్యాధి, విరేచనాలు వంటి జీర్ణ సంబంధ వ్యాధుల చికిత్సకు చక్కగా సహాయపడుతుంది. పసుపు సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్ అని కూడా చెప్పవచ్చు. ముఖంపై మొటిమలు , ముడతలను, మృత కణాలను కూడా పసుపు తగ్గిస్తుంది. ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకుంటే రెండు వారాల లోపు పసుపును వాడకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నవారు కూడా పసుపును వాడకపోవడమే మంచిది.. పసుపు అల్లం జాతికి చెందిన మొక్క కాగా, పసుపు శాస్త్రీయనామం కుర్కుమా లాంగా. ఇది భారత ఉపఖండం, ఆగ్నేయాసియాకు చెందినది. పసుపును ఆయుర్వేద ఔషధాలలో వాడుతారనే విషయం మనకు తెలిసిందే.ఇది క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.