Health Tips : ప్రస్తుత కాలంలో చాలామంది గ్యాస్ట్రిక్ మరియు ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల వలన పొట్ట వస్తుంది.ఒక్కసారి వచ్చిన పొట్ట ను తగ్గించుకోవడం చాలా కష్టం. దాన్ని తగ్గించుకోవడానికి చాలా వ్యాయామాలు చేసినప్పటికీ ఫలితం రావడం లేదు. అయితే పొట్టను చాలా సులభంగా తగ్గించుకోవడానికి మేము ఒక చిట్కాను తీసుకువచ్చాం. దీనిని ప్రతిరోజు పరిగడుపున తీసుకోవడం వలన 15 రోజులల్లోనే ఫలితం కనిపిస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే దీనికోసం ముందుగా మూడు నిమ్మకాయలను అలాగే ఒక రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని మెత్తగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలను తీసుకోవాలి.
ముందుగా మూడు నిమ్మకాయలను బేకింగ్ సోడాలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత నిమ్మరసాన్ని పిండుకొని పక్కన పెట్టుకోవాలి. రసం తీసేసిన నిమ్మ చెక్కలను ఒక గిన్నెలో వేసుకుని అందులో ఒక లీటర్ నీళ్లను పోయాలి.తర్వాత దీనిలో ఒక చెంచా నల్ల మిరియాలు మరియు ముందుగా తురుముకుని పెట్టుకున్న అల్లంను మరియు దాల్చిన చెక్కలను వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. పదినిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి దింపుకొని చల్లార్చుకోవాలి.

ఇలా చల్లార్చిన నీటిని వడకట్టుకుని ఒక గ్లాసులో పోసుకుని , దానిలో ఒక చెంచా తేనెను కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరిగడుపున తాగాలి. ఇలా ఒక 15 రోజులు పాటు చేయడం వలన మీ పొట్ట తగ్గడాన్ని మీరు గమనిస్తారు.ఇది తీసుకున్న తరువాత ఒక గంట వరకు ఏం తీసుకోకూడదు. ఇలా దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో తోడ్పడుతుంది. అలాగే ఇది గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు దీనిని త్రాగుతూ,వ్యాయామం చేస్తూ, ఆహారపు నియమాలను పాటించినట్లయితే చాలా కొద్ది రోజుల్లోనే రిజల్ట్ పొందుతారు.అలాగే దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.దీనిని ఇలాంటి వయస్సు వారైనా సరే తీసుకోవచ్చు.