Weight Loss : ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం, బయటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వలన ఈజీగా బరువు పెరుగుతున్నారు. అయితే బరువు తగ్గడం కోసం వివిధ రకాల వ్యాయామాలు, డైట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ శరీరంలో ఎటువంటి మార్పు ఉండదు. మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ లు ఉపయోగిస్తారు. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోని పదార్థాలతో ఈజీగా బరువు తగ్గవచ్చు. దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు స్పూన్ కలోంజి విత్తనాలు వేసుకోవాలి. కలోంజీ విత్తనాలు శరీరంలో అధిక బరువును తగ్గించడానికి బాగా సహాయపడతాయి. తర్వాత అర స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా అధిక బరువును తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఒక స్పూను సోంపు వేసుకోవాలి. సోంపు శరీరంలో అధిక కొవ్వు తగ్గిస్తుంది. సోంపు తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అధిక బరువు సమస్యలను తగ్గించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి స్టవ్ పై పెట్టి ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని వడకట్టుకోవాలి. తర్వాత ఇందులో తేనే వేసి కలుపుకోవాలి. కావాలంటే దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న దాన్ని ప్రతిరోజు పరిగడుపున తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి అధిక బరువు సమస్య తగ్గిపోతుంది. డైటింగ్, జిమ్ చేసిన బరువు తగ్గడం లేదు అనుకున్న వారు ఈ డ్రింక్ ను 15 రోజులపాటు త్రాగాలి. ఈ డ్రింక్ తాగడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక అన్ని వయసులవారు ఈ డ్రింక్ ను త్రాగవచ్చు.