Health Tips : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల వలన చాలామంది అనేక రకల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీనిలో ఒకటి మలబద్ధత సమస్య. నీటిని తక్కువగా తాగడం , జంక్ ఫుడ్ అధికంగా తినడం , మసాలాలు మరియు ,మాంసాహారాన్ని ఎక్కువగా తినడం వలన మల మద్దిక సమస్య వస్తుంది. దీని వలన మల విసర్జన సరిగా జరగపోవడం, బాహ్య మొలలు, రక్త మొలలు వంటివి ఏర్పడతాయి. దీని వలన కూర్చోలేకపోవడం నిల్చలేక పోవడం , దురద , వాపువంటి ,సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను తట్టుకోవడం చాలా కష్టం. ఈ సమస్యను ఎదుర్కొనేవారు అందరితో కలిసి సంతోషంగా ఉండలేరు. అయితే ఆయుర్వేదంలో అనేక రకాల చికిత్సలను అనుసరించి వీటిని తగ్గించుకోవచ్చు.
అలాగే కొన్ని ఆహారపు అలవాటులను మార్చుకోవడం వలన మలబద్ధక సమస్యను దూరం చేసుకోవచ్చు. వీటితోపాటు ఈ చిట్కాను ఉపయోగించడం వలన ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగా ఒక పటికను తీసుకోవాలి. అయితే అది సాధారణ దుకాణాలలో దొరికే పటిక కాదు. దానిని వెలిగారం కంకణం అనే పేరుతో పిలుస్తారు. ఇక దీనిని కొంతమంది ఇంటిముందు దిష్టి తగలకుండా కడుతుంటారు. అలాగే ఈ పట్టిక తీపి రుచిని కలిగి ఉండదు.
ఈ పటిక అనేక రోగాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఆయుర్వేద షాపుల్లో , దుకాణాలలో అందుబాటులో ఉంటుంది. అయితే దీనిని నేరుగా తీసుకోకూడదు. దీని కోసం ముందుగా ఒక పాత్ర తీసుకొని మంటపై వేడి చేయాలి. పాత్ర వేడి అయిన తర్వాత పట్టిక ముక్కను దానిలో పెట్టాలి.

ఆ వేడికి పటిక కరిగినీరుల మారుతుంది. పటిక మొత్తం కరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత ఆ పటిక మళ్ళీ గట్టిపడుతుంది. ఆ గట్టిపడిన పదార్థాన్ని మిక్సీలో వేసుకొని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు చిట్కా కోసం ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకొని దానిలో రెండు చిటికెడులా పట్టిక పొడిని వేసుకోవాలి. అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు ఒక అరటిపండును తీసుకొని తొక్క తీసి అరటి పండుకు ఘాటు పెట్టుకోవాలి. ఆ ఘాటులో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టాలి. ఇక ఈ అరటి పండును ప్రతిరోజు ఉదయం పరిగడుపున తినాలి. దీనిని వారంలో నాలుగు రోజులు పాటు తీసుకున్నట్లయితే అల్సర్ , ఎసిడిటీ , మొలలు, రక్త మొలలు వంటి సమస్యల ను చాలా తక్కువ కాలంలోనే తగ్గించుకోవచ్చు.