Hair Tips : ఈరోజుల్లో చాలామంది పార్లర్ కు వెళ్లి స్పా చికిత్సను చేసుకుంటున్నారు . స్పా చికిత్స వలన జుట్టు ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో ఇంట్లోనే స్పా చికిత్సను చేసుకోవచ్చు. స్పా చికిత్స కోసం ప్రతిసారి పార్లర్ వెళ్లడం వలన అక్కడ ఎక్కువ మొత్తంలో మూల్యం ,చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇంట్లో తయారు చేసుకుంటే ఖర్చు లేకుండా అయిపోతుంది. అలాగే కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా హెయిర్ స్పా ట్రీట్మెంట్ ను ఇంట్లోనే తీసుకోవచ్చు. దీనివలన ఖర్చు లేకుండా ,మీ జుట్టుకు హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
హెయిర్ స్పా కోసం మీ ఇంట్లో కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు. దీనికోసం మీ జుట్టు పొడవును బట్టి కొబ్బరి పాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దానిని జుట్టుకు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత టవల్ తీసుకుని తలకు కట్టి అరగంట వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నాచురల్ షాంపుతో జుట్టును కడగాలి. ఇలా చేయడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది.గుడ్డుతో హెయిర్ ప్యాక్: గుడ్డును స్పా ట్రీట్మెంట్ గా ఉపయోగిస్తారు. ఎందుకంటే గుడ్డు మంచి హెయిర్ ప్యాక్ . ఈ గుడ్డులో ఆలివ్ ఆయిల్ ,తేనె , కలిపి బ్రష్ సహాయంతో అప్లై చేసుకుంటే ,జుట్టుకు చాలా మేలు జరుగుతుంది.

దీనిని అప్లై చేసుకున్న తర్వాత 20 నుంచి 25 నిమిషాలు ఉంచి తర్వాత షాంపూతో కడగాలి.గ్రీన్ టీ ఎయిర్ మాస్క్: గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కావున ఇవి జుట్టుకు చాలా మంచిది. ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు దీన్ని ఉపయోగిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికోసం రెండు స్పూన్ల గ్రీన్ టీ పౌడర్ తీసుకుని ,నీటిలో వేసి మూత పెట్టి పది నిమిషాలు మరిగించుకోవాలి .ఆ తర్వాత దానిని చల్లార్చుకుని తలకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఒక అరగంట అలా ఉంచిన తర్వాత సాధారణ నీటితో కడగాలి.