Health Tips : సీతాఫలం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. మంచి రుచిని అధిక పోషకాలను కలిగి ఉన్న ఈ పండు వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది. ఈ పండును చిన్న పెద్ద ,అన్ని వయసుల వారు చాలా ఇష్టంగా తింటారు. సీతాఫలం విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ ను పుష్కలంగా కలిగి ఉంటుంది. అలాగే దీనిలో ఐరన్, ఫాస్పరస్ ,మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాగే దీనిలో విటమిన్లు ఖనిజాల తో పాటు పీచు పదార్థాలు కూడా లభిస్తాయి. సీతాఫలమును జ్యూస్ చేసుకొని కాకుండా డైరెక్ట్ గా తినడమే చాలా మంచిది.
సీతాఫలం యొక్క గుజ్జును తినడం వలన నోట్లో జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి.తద్వారా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. సీతాఫలం యొక్క పండ్లే కాకుండా ఆకులు గింజలు ప్రతి ఒక్కటి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొన్ని దీర్ఘకాలిక రోగాలను నశింపజేసే శక్తి శీతాఫలానికి ఉంది.ఇక ఇది ఏ రోగాలను తగ్గించడంలో ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం .దీనిలో ఉండే విటమిన్ సి కంటిచూపు మరియు జీర్ణ వ్యవస్థ క్రమబద్ధీకరించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ ఏ జుట్టు మరియు చర్మం సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడం వలన గుండెజబ్బులు దరి చేరవు. దీనిలో ఉండే కాపర్ గుణాలు మలబద్ధకం తగ్గించి ,జీర్ణ క్రియ సాఫీగా అయ్యేలాా చూస్తుంది. బరువు పెరగాలి అనుకునేవారు సీతాఫలం అధికంగా తినడం వలన బరువును పెంచుకోగలుగుతారు. అలాగే సీతాఫలం యొక్క గింజల పొడి తలలోని పేల ను పోగొట్టడానికి మందుల పనిచేస్తుంది. అలాగే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు సీతాఫలం ఆకుల రసాన్ని గాయానికి రాస్తే దెబ్బలు త్వరగా తగ్గుతాయి. గర్భిణీ స్త్రీలు ఈ పలాన్ని తినడం వలన కడుపులోని బిడ్డకు కండరాల అభివృద్ధి, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది.