Health Tips : మనదేశంలో వేప చెట్లు ప్రతి చోట ఉంటాయి. పల్లెటూర్లలో వీటిని ఎక్కువగా చూస్తుంటాం. ఈ చెట్టు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే వేప చెట్టు లోని ప్రతి భాగం, ప్రతి కొమ్మ, ప్రతి బెరడు ,ప్రతి ఆకు, ఔషధ గుణాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. అలాగే సాంప్రదాయ ఔషధాలను తయారు చేయడానికి వేప యొక్క ఆకులను వేరులను బాగా ఉపయోగిస్తారు. అలాగే వేప చెట్టు జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి సహాయపడే గొప్ప దివ్య ఔషధం అని పెద్దలు చెబుతారు.
అలాగే ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ హానికరమైన UV కిరణాలు మరియు కాలుష్యం ఇతర పర్యావరణ సమస్యల నుండి చర్మ సమస్యల నుండి రక్షణ ఇస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్లు , కొవ్వు ఆమ్లాలు చర్మం ను జాగ్రత్తగా ఉంచి ముడతలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది. అలాగే వేప లో ఉండే ఆంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియా మన శరీరానికి హానికరమైన శిరింద్రాల నుండి దూరంగా ఉంచుతాయి.పురాతన కాలం నుండి భారతీయుల అనుసరించే అనేక గృహం నివారణలో వేప చెట్టు ఒకటి. అప్పట్లో వేప పుల్లను పళ్ళు రుద్దుకోవడానికి ఉపయోగించేవారు.

తద్వారా దానిలో ఉండే ఔషధాలు నోటిలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. అలాగే నోటి పరిశుభ్రతను కాపాడుతుంది. అలాగే వేప ,శరీరంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే జ్వరం మలేరియా నుండి దూరంగా , ఉండటానికి వేపాకును వేడి నీళ్లలో వేసుకుని స్నానం చేయడం మంచిది . అలాగే వేప యొక్క ఆకులు మేతగా రబ్బి జుట్టు కు పెట్టుకోవడం ద్వారా జుట్టు బలంగా చుండ్రు లేకుండా ఉంటుంది. అలాగే రోజుకు మూడు ఆకులను ఉదయాన్నే లేవగానే నమలడం ద్వారా చాలా సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.