Health Benefits : చక్కెర కన్నా బెల్లమే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బెల్లంతో అనేక రకాల వంటకాలు చేస్తారు. బెల్లంలో ఐరన్, పొటాషియం, ప్రోటీన్ వంటి పోషకాలు ఉండగా, అవి శరీరానికి మేలు చేస్తాయి. అయితే డయబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా బెల్లానికి దూరంగా ఉండాలి. ఇది రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ను పెంచే ప్రమాదం అయితే ఉంది. బెల్లంలో ఐరన్, ఫోలేట్లు సమృద్దిగా ఉండడం వలన ఇది తింటే రక్తం మంచిగా తయారవుతుంది. అలానే . ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు నిత్యం బెల్లం తింటే మంచిది.
బెల్లంలో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన పేగులకు బలం చేకూరుస్తుంది. శరీరాన్ని చల్లబరిచే గుణం కూడా బెల్లానికి ఉంది. బెల్లం వేసి తయారు చేసిన పానకం వంటి మిశ్రమాన్ని వేసవిలో తాగితే మన శరీరానికి రక్షణగా ఉండడంతో పాటు బాడీని చల్లగా ఉంచుతుంది. . హైబీపీ సమస్య ఉన్నవారు నిత్యం బెల్లం తినడం ద్వారా ఆ సమస్య నుంచి బయట పడే అవకాశం కూడా ఉంది. బెల్లం అధిక బరువును తగ్గించుకునేందుకు కూడాసహాయ పడుతుంది. నిత్యం భోజనం చేశాక దీన్ని మధ్యాహ్నం, రాత్రి తినడం వల్ల శరీర మెటబాలిజం క్రమంగా పెరిగి క్యాలరీలు ఖర్చవుతాయి.

Health Benefits : ఎక్కువగా తినొద్దు..
అయితే బెల్లం వలన కొన్ని అనర్ధాలు కూడా ఉన్నాయి. బెల్లం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది. దీన్ని రోజు తింటే.. బ్లడ్ సుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి, డయబెటీస్ ఉన్నా.. లేకున్నా బెల్లానికి దూరంగా ఉండండి. బెల్లాన్ని కూడా చెరకుతోనే తయారు చేస్తారు. అయితే, చక్కెర తయారీలో పాటించే శుభ్రత బెల్లం తయారీలో ఉండక పోవడం వలన కంటికి కనిపించని సూక్ష్మజీవులు, పరాన్నజీవులు అందులో ఉంటాయి. అందుకే ఎక్కువ బెల్లం తినడం వలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫుడ్ డైట్ తీసుకొనేవారు కొద్దిగా బెల్లం తీసుకోవడం వల్ల సమస్య ఏమీ ఉండదని చెబుతారు. అయితే, మొతాదుకు మించి తీసుకుంటేనే అసలు సమస్య మొదలవుతుంది.