Skin Care : ప్రస్తుతం చాలామంది స్కిన్ సమస్యలతో చాలా బాధపడుతున్నారు. మొహంపై మొటిమలు, మొటిమల మచ్చలు, ఓపెన్ పోర్స్ ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ నలుగురిలో తిరగాలంటే చై గా ఫీలవుతూ ఉంటారు. అలా నలుగురిలో తిరిగేటప్పుడు వాటిని దాచే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అనుకునే వాళ్లు ఒక్కసారి ఈ టిప్ ని ట్రై చేయండి మంచి ఫలితం దక్కుతుంది. దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు.దీనికోసం మొదటగా ఆలుగడ్డను తీసుకొని తొక్క తీసి మెత్తగా తురుముకోవాలి. లేదా మిక్సీలో మెత్తని పేస్టులా పట్టుకోవచ్చు. తర్వాత దీని నుండి జ్యూస్ ని తీసుకోవాలి.
ఈ ఆలుగడ్డలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఫేస్ పై వచ్చే ఎటువంటి సమస్యలైనా తగ్గిస్తుంది ఈ ఆలుగడ్డ. యాంటీ బ్లీచ్ గుణాలు కలిగి ఉండడం వలన ఇది ఫేస్ పై ఉండే మురికి జిడ్డుని పోగొట్టి ముఖం కాంతివంతంగా అందంగా చేస్తుంది. మీ ఫేస్ పై ఉండే సన్ టాన్ కూడా తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఆలుగడ్డలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి స్కిన్ ని హెల్దీగా చేస్తాయి. ఈ జ్యూస్ లో కొంచెం గ్లిజరిన్ ని యాడ్ చేసి నూరి ఒక స్పూన్ ముల్తాన్ మట్టి ఒక చెంచా రోజ్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ ప్యాక్ ని వేసుకోవడానికి మునుపు పలువురు మేకప్ తీసేయాలి. తర్వాతే దీనిని అప్లై చేసుకోవాలి.

ఇలా చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తదుపరి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తొలగించడం కోసం చల్లని నీళ్లను వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది.దీనిని వాడడం వలన ఫేస్ పై ఉండే ఓపెన్ ఫోర్స్ నల్లటి మచ్చలు, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ లాంటి ఇబ్బందులు తొలగిపోయి మీ ఫేస్ కాంతివంతంగా, అందంగా తయారవుతుంది. దీనిని వారంలో రెండుసార్లు వాడడం వలన మీ ఫేస్ పై ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఓపెన్ ఫోర్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు నిత్యము రాత్రి పడుకునే సమయంలో ఐస్ క్యూబ్స్ లేదా చల్లని నీటిలో క్లాత్ని ముంచి దానితో మసాజ్ చేసుకొని వత్తడం వలన ఓపెన్ ఫోర్స్ తొలగిపోతాయి.