Lemon: నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిమ్మకాయని మనం పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా నిమ్మరసం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు పొట్ట సంబంధిత సమస్యల నుంచి కూడా మనకు రక్షణగా నిలుస్తుంది. ఇక గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలసిందే. . మామూలు నీళ్లతో తయారు చేసిన నిమ్మరసం కంటే వేడినీళ్ల నిమ్మరసం చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దోహద పడుతుంది.
వేడి నీళ్ల నిమ్మరసం ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా ఒక గ్లాసు నీళ్లను ఒక గిన్నెలో తీసుకుని, సగం నిమ్మకాయ ముక్కను అందులో వేసి రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత నిమ్మకాయను నీళ్లలో పిండి బాగా కలుపుకోవాలి. రుచి కోసం కాస్త తేనే కూడా కలుపుకోవచ్చు. కొద్ది సేపటి తర్వాత మనం ఇది తాగితే చాలా రుచికరంగానే ఉండడంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి, బితోపాటు భాస్వరం కూడా ఉంటుంది కాబట్టి శరీరంలో ఆక్సిజన్ లోపాన్ని నివారిస్తుంది. నిమ్మకాయలో ఉండే పోటాషియం రక్తనాళాలని శుభప్రరుస్తుంది. వేడి నీటిలో నిమ్మ ముక్కను మరిగించి తాగడం వల్ల చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

Lemon : ఆరోగ్యానికి మేలు..
నిమ్మకాయ శరీరంలో శక్తివంతమైన ఆల్కలీన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది వాపులను, దీర్ఘకాలిక నొప్పులను కూడా తగ్గిస్తుంది. నిమ్మకాయలో 22 క్యాన్సర్ వ్యతిరేక సమ్మేళనాలు ఉన్నాయి. ఇది జంతువుల్లో క్యాన్సర్ కణితుల పెరుగుదలను నిలిపివేస్తుందని గుర్తించారు. వేసవి తాపాన్ని అధిగమించేందుకు.. శీతాకాలపు ఉదయాన్ని కిక్‌స్టార్ట్ చేయడంలో నిమ్మకాయ నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీలున్నప్పుడు తప్పక నిమ్మకాయ రసం తాగండి. నిమ్మకాయ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఫోలేట్, ఫ్లేవనాయిడ్లు, కొంత మొత్తంలో విటమిన్ బీ ఉంటాయి. వాటి వలన ఆక్సీకరణ ఒత్తిడి నుంచి దీర్ఘకాలిక మంటను నివారించడంలో సహాయపడతాయి. దీనిలోని సీ విటమిన్ ఆహారం నుంచి ఐరన్‌ను గ్రహించడంలో తోడ్పడడమే కాక, హిమోగ్లోబిన్ సరిగా ఉండేలా కాపాడుతుంది.