Health Tips : భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఇష్టమైన అల్పాహార వంటకాలలో పోహ ఒకటి.మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇవ్వడంలో పోహా ఒక మంచి ఆహారం అని చెప్పాలి.పోహాను తయారు చేయడం చాలా సులభం. అలాగే ఇది తేలికగా జీర్ణం అవుతుంది.దీనిలో ఐరన్ మరియు పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.అలాగే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.ఇక ప్రతిరోజు రైస్ ను తినడం అంత మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు.తెల్ల బియ్యం తీసుకోవడం వలన దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటైన మధుమేహం లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఇక తెల్ల బియ్యం లో బరువు పెరగడానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లను ఉంటాయి.
కావున బరువు తగ్గాలి అనుకునే వారు బియ్యానికి బదులుగా పోహ ను తినడం చాలా మంచిది.పోహా మరియు బియ్యం రెండూ కూడా వరి నుండే తయారవుతాయి.కానీ బియ్యం కంటే పోహ తక్కువ ప్రాసెసింగ్ మరియు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.పోహ ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు 70% అలాగే కొవ్వు పదార్థాలను 30% కలిగి ఉంటుంది.కావున ఇది ఉత్తమమైన అల్పాహారంగా నేటిజనులు భావిస్తున్నారు. అలాగే గర్భం దాల్చిన స్త్రీలు మరియు రక్తహీనత ప్రమాదం ఎక్కువగా ఉన్న మహిళలు ఈ పోహాను తీసుకోవడం చాలా మంచిది.ఇంకా ఒక గిన్నె పోహ లో నిమ్మరసం కలుపుకొని తినడం వలన శరీరంలోని ఐరన్ సక్రమంగా ఉంటుంది.

అలాగే కొంతమంది రుచి కోసం పోహ లో వేరుశనగలను కలుపుతారు.అయితే ఇది క్యాలరీలను పెంచుతుంది.అలాగే పోహాలు వేరుశనలు వేసుకొని తినడం వలన రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. పోహలో ఉండే పీచు పదార్థం చక్కెరను రక్త ప్రవాహంలోకి విడుదల చేసి చక్కెరను నియంత్రిస్తుంది.అలాగే పోహాను కూరగాయలతో కూడా వండుకోవచ్చు .దీనివలన 200 క్యాలరీలు లభిస్తాయి. పోహా అధిక ప్రోటీన్స్ ను కలిగి ఉండడం ద్వారా జీవక్రీయ ను మెరుగుపరిచి పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.