Health Tips : ప్రస్తుతం మారిన జీవనశైలిలో ఎన్నో అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి మనం తిని తీసుకునే ఆహారం ప్రధాన కారణం అవుతుంది. ఇంకా కొత్త రోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన కరోనా దీనికి నిదర్శనం అని చెప్పవచ్చు. చాలావరకు మన ఆరోగ్యం మనం తినే ఆహారంపైనేే ఆధారపడి ఉంటుంది. అందుకే ఏవి పడితే అవి తినకూడదు అని డాక్టర్స్ చెబుతుంటారు. దీని సమస్య మొదట్లో అంతగా ఉండకపోయినా రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం చూపిస్తుంది. చాలామంది తక్కువ వయసులోనే గుండెపోటుతో చనిపోతున్నారు. దీనికి గల కారణం వారు తీసుకునే ఆహారం చెడు అలవాట్లు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొన్ని చెడు వ్యసనాలతో పాటు కొన్ని ఆహార పదార్థాలను దూరం పెడితే ఇలాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దశలో ఎలాంటి ఆహారం తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయో మనం తెలుసుకుందాం. సిగరెట్, ఆల్కహాల్ : సిగరెట్లు మరియు ఆల్కహాల్ ను ఎక్కువగాా తాగేవారికి ఊపిరితిత్తులు మరియు కాలేయం ఎక్కువ హానికి గురవుతాయి. ఇక ఇవి గుండె పై నేరుగా చూపుతాయి. దీని వలన హై బీపీ ,హార్ట్ ఫెయిల్యూర్ వంటివి వస్తాయి . కాబ్బటి ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.కూల్ డ్రింక్స్ : ఈ రోజులు ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ కు బాగా అలవాటు పడ్డారు. దాహం వేసిన , ఏదైనా మసాలా ఫుడ్ తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ ను తాగుతున్నారు.

ఈ శీతల పానీయాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వీటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది. ఆయిల్ ఫుడ్స్ : చాలా మంది స్పేసీ ఫుడ్ , ఫాస్ట్ ఫుడ్ ల ను తినడానికి ఇష్టపడుతున్నారు . వీటిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది .ఇక ఈ ఆయిల్ ఫుడ్స్ వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికం గా పెరుగుతుంది. దీని వలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ కాబ్బటి తినే ఉంది ఆలోచించడం మంచిది. వీటికి బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను,ఆకు కూరగాయలను తీసుకోవడం మంచిది.