Diabetes : వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఇప్పుడు డయాబెటిస్ అధికంగా మన ఇండియాలోనే ఉంది. ప్రపంచంలోనే డయాబెటిస్ కలిగిన వారు 17 శాతం కంటే ఎక్కువ మంది మన ఇండియాలోనే ఉన్నారు. డయాబెటిస్ కి రావడానికి ముఖ్య కారణాలు వయసు అయిపోవడం , సరిగా అన్నం తినకపోవడం ,ఊబకాయం , ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం. అయితే షుగర్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.డయాబెటిస్ తో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా భోజనం చేయాలి.అలాగే రెగ్యులర్ గా మూడు నెలల వారీగా hba1c, మరియు ఆరు నెలలకి ఓసారి పూర్తి బాడీ చెకప్ చేయించుకోవాలి.
వీరు మందులు , ఇన్సులిన్ తీసుకొని భోజనం చేయకపోతే ప్రమాదాలకు గురవుతారు.దీనివలన తల చేతులు, చేతులు కాళ్లు చల్లబడడం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవి భారీ పరిణామాలకు దారితీస్తాయి.అలాగే ఇది పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ కి కారణం కూడా అవ్వచ్చు.కాబట్టి ముందే గుర్తుంచి పంచదార తింటే మెరుగవుతుందని అండర్ సర్జన్ జెరియాటిక్ కేర్ డాక్టర్ అమన్ కేర చెబుతున్నారు.డయాబెటిస్ సాధారణ లక్షణాలు చూస్తే దాహం ఎక్కువ కావడం,మూత్రం రావడం, బరువు తగ్గడం , వంటి సమస్యలు వస్తాయి.అలాగే వృద్ధులకు టైపు 2 డయాబెటిస్ వస్తుంది. దీనిని మెచ్యూరిటీ ఆన్ సెట్ డయాబెటిస్ అంటారు.

ఇది సాధారణంగా 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారికి లోపిస్తుంది. దీనికి నోటి ద్వారా తీసుకునే మందులతో ట్రీట్మెంట్ చేస్తారు.అలాగే డయాబెటిస్ ఉన్నవారు గుండెపోటు ,స్ట్రోక్స్ , హెరి పెరల్ వాస్కులర్ , దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యం , లాంటి జబ్బులకు లోన్ అవుతారు.కావున ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవడం మంచిది. అలాగే డాక్టర్ ను కలిసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం మంచిది.అయితే డయాబెటిస్ ఉండి వయసు పైబడిన వారు చక్కెర ను లేదా స్వీట్స్ ను దగ్గర ఉంచుకోవడం మంచిది.అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి మందులతోపాటు , వ్యాయామం , నడక , వర్కౌట్స్ క్రమం తప్పకుండా చేయడం చాలా అవసరం. డయాబెటిస్ తో బాధపడేవారు రోజులో కనీసం 45 నిమిషాలు నడవడం మంచిది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనం ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ఆధారంగా వివరించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే , ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడం మంచిది.