Minerals And Vitamins : కరోనా మహమ్మారి ఎంత వినాశనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వలన ఎంతో మంది కన్నుమూసారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా వెంటాడుతూనే ఉంది. పోస్ట్ కోవిడ్ లక్షణాల్లో గుండె సమస్య ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. పోస్ట్ కోవిడ్లో గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువే కన్పిస్తోంది. యుక్త వయస్సు అంటే 30-40 ఏళ్ల వారిలో కూడా పోస్ట్ కోవిడ్లో భాగంగా గుండె సమస్య ప్రధానంగా మారింది. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కచ్చితంగా గుండె సంబంధిత పరీక్షలు తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. పోస్ట్ కోవిడ్లో ఆరోగ్యపరంగా పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. సరైన పౌషికాహారం, వ్యాయామం, తగిన విశ్రాంతి తప్పనిసరిగా చూసుకోవాలి.
కరోనా వైరస్ బారిన పడినవారిలో 40 శాతం మందికి గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. ఇందులో ప్రధానంగా హార్ట్ పంపింగ్ తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, లేదా హార్ట్ రేట్ తక్కువగా ఉండటం, హార్ట్ ఎటాక్, పెరాలసిస్ స్ట్రోక్ వంటివి లక్షణాలుగా కన్పిస్తున్నాయి. అయితే వాటి నుండి బయటపడాలి అంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక ఖనిజాలు వాడాలి. వీటిలో అతి ముఖ్యమైనది ఖనిజం జింక్.. పోస్ట్ కోవిడ్ కరణంగా చాలా మంది జింక్ సమస్యలతో బాధపడుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే వాటిలో జింక్ ఒకటి. జింక్ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Minerals And Vitamins : ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
జింక్ అధిక పరిమాణంలో కాల్చిన బీన్, పాలు, జున్ను, పెరుగు, ఎర్ర మాంసం, శనగలు, కాయధాన్యాలు, గుమ్మడికాయ, నువ్వులు, వేరుశెనగ, జీడిపప్పు, బాదం, గుడ్డు, గోధుమలు, బియ్యం ఆహారాల్లో లభింస్తుంది. శరీరంలో జింక్ లోపాన్ని ఈ ఆహారాలతో తీర్చుకోవచ్చు. శరీరంలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక వేళా శరీరంలో కోరత ఉంటే..రక్తహీనత, హిమోగ్లోబిన్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి ఐరన్ కోరత తొలగిపోవడానికి.. ఆహారంలో బచ్చలికూర, బీట్రూట్, దానిమ్మ, ఆపిల్, పిస్తా, ఉసిరి, డ్రై ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్ని తీసుకోవాలి.రక్తపోటును నియంత్రించడానికి మెగ్నీషియం చాలా సహాయపడుతుంది. వేరుశెనగ, సోయా పాలు, జీడిపప్పు, బాదం, బచ్చలికూర, బ్రౌన్ రైస్, సాల్మన్ ఫిష్, చికెన్ వంటి ఆహారాలను తీసుకుంటే మెగ్నీషియం లోపాన్ని అధిగమించవచ్చు.