Hair Tips : ఈ మధ్యకాలంలో ప్రతి వయసు వారికి జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ యూస్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతున్నారు. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో దొరికే కలబందతో ఇలా చేసి చూడండి కచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే .ముందుగా రెండు కలబంద మట్టలను తెచ్చి పక్కన పెట్టుకోవాలి.దాని నుండి వచ్చే గుజ్జు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలోవెరా ఆంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏ , విటమిన్ బి ,విటమిన్ సి, విటమిన్ డి, ను సమృద్ధిగా కలిగి ఉంటుంది.
ఇది జుట్టు రాలడన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కట్ చేసుకున్న అలోవెరా ముక్కలను ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకుని మరిగించుకోవాలి. గ్రీన్ కలర్ లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నూనె ను ఎక్కువసేపు మరిగించకూడదు. ఎక్కువ సేపు మరిగిస్తే అలోవెరా లో ఉండే పోషకాలు నశిస్తాయి.అలాగే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడం మంచిది.దీనిని రోజు విడిచి రోజు వాడటం మంచిది.

అయితే దీన్ని రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుని ఉదయం లేచాక ఏదైనా షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా ఆరుసార్లు చేసినట్లయితే జుట్టు ఒక వారంలోనే ఒత్తుగా రావడన్ని గమనిస్తారు. దీన్ని వినియోగించడం వలన చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ సమస్యలు తగ్గుతాయి. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు, కావున అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. దీని అన్ని వయసు వారు ఉపయోగించవచ్చు. జుట్టు రాలిపోయి సన్నగా ఉంది అనుకున్నవారు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి కచ్చితంగా రిజల్ట్ ఉంటుంది