Ajwain : వాముని మనం తరచుగా ఉపయోగిస్తుంటాం. వాము వలన జీర్ణక్రియ కూడా మెరుగుపుడుతుందనే విషయం తెలిసిందే. బరువు తగ్గడానికి వాము ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. అయితే పొట్ట సమస్యలు, బరువు తగ్గడానికి తప్పకుండా ఈ డ్రింక్‌ను తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వాటర్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్ గా చేసేందుకు సహాయపడతాయి. వాము వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉదర సంబంధిత సమస్యలు, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వామును విరివిగా వాడుతారు. వాములో వివిధ రకాల ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైరెక్ట్‌గానూ, నీటిలో నానబెట్టి కూడా తింటారు. అయితే, ఇది అవసరానికి తగినట్లు తింటే మంచిదే.. కానీ, అవసరానికి మించి తింటే మాత్రం పెద్ద పలు సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వామును అధికంగా తీసుకోవడం వలన కలిగే నష్టాలు ఉన్నాయి.దీర్ఘకాలికంగా గ్యాస్, గుండెల్లో మంట సమస్యలతో బాధపడేవారు వామును అధికంగా తీసుకుంటారు.

Ajwain : వాముతో జాగ్రత్త..
అయితే, అతిగా తీసుకుంటే.. గుండెల్లో మంట తగ్గించడానికి బదులుగా.. యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ సమస్య వేధిస్తుంది. చాలా మందికి అలర్జీ ఉంటుంది. అలర్జీ ఉన్నవారు పొరపాటున వాము తింటే.. తల తిరగడం, వికారం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు . వాము నోటిలో మంట కలిగించే అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వాము అతిగా తినడం వలన నోట్లో పుండ్లు కూడా అయ్యే అవకాశం ఉంది. ఏదైన మితంగా తీసుకుంటే మంచిది.. అందుకే వామును మితంగా తీసుకోవాలి. గర్భంతో ఉన్నవారు వాముకు దూరంగా ఉండటం మంచిది. వాము.. పిండం అభివృద్ధిని అడ్డుకుంటుందని అంటున్నారు.