Diabetes : చేపలు తినడం వలన చాలా లాభాలు ఉన్నాయి. చేపలు ప్రోటీన్ మరియు కొవ్వును అధికంగా కలిగి ఉంటాయి.వీటిని తినడం వలన చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు.నిపుణులు రెగ్యులర్ గా చేపలు తినడం వలన అనేక వ్యాధులనుండి రక్షణ పొందవచ్చు అని చెబుతున్నారు.అయితే ఇప్పుడు వీటిలో ఏవి తింటే మంచిదో మనం తెలుసుకుందాం.
1. ట్యూనా… ఈ చేపలు విటమిన్ సి , విటమిన్ డీ ను అధికంగా కలిగి ఉంటాయి.అలాగే వీటిలో కాల్షియం ,ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.ఇవి పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు తినడం మంచిదని ఇప్పుడు చెబుతున్నారు.
2. సాల్మన్.. సాల్మన్ చేపలు ఒమేగా 3 కలిగి ఉంటాయి.సాల్మన్ చేపలలో రెండు జాతులు ఉన్నాయి .ఒకటి వ్యవసాయ సాల్మన్ రెండు అడవి సాల్మన్. అడవి సాల్మన్ చేపలకంటే వ్యవసాయ సాల్మన్ చేపలు తక్కువ ధరకు లభిస్తాయి.ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి తోడ్పడతాయి.

3.పొలుసుల చేప… ఈ చేప ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటి. ఇది విటమిన్ బి12 మరియు ఒమేగా 3 లను అధికంగా కలిగి ఉంటుంది. డయాబెటిక్ హార్ట్ పేషెంట్స్ ఈ చేపను తినటం చాలా మంచిది .ఈ చేపలు తినడం వలన గుండె సమస్యలకు తక్కువగా గురవుతారు.
4. హెర్రింగ్… ఇవి చూడడానికి సార్థిన్ చేపల్లా ఉంటాయి.ఇవి విటమిన్ డి,మరియు జింక్ లను కలిగి ఉంటాయి.ఇవి మృదువైన మాసం మరియు మంచి రుచిని కలిగి ఉంటాయి.ఇవి ఎర్ర రక్త కణాలు ఆరోగ్యంగా ఉండడంలో తోడ్పడతాయి. అలాగే వీటిని షుగర్ ,ఉన్న వాళ్లు ,తినడం వలన తమ సమస్యలను కొంచెం వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : ఇది మేము ఆరోగ్య నిపుణులు లక్షణాలు ప్రకారం వివరించాం .ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.