Hair Tips : వృద్ధాప్య ప్రభావం చర్మం పైన నే కాకుండా జుట్టుపై కూడా ఉంటుంది. ఇక వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లగా మారుతూ వస్తుంది. అయితే జుట్టు మీద చాలా పరిశోధన చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే.. జుట్టులో వర్ణద్రవ్యంను ఉత్పత్తి చేసే కణాలు దాని తయారీని ఆపేసినప్పుడు తెల్ల వెంట్రుకలు వస్తాయని నిర్ధారించారు.అలాగే సహజ హైడ్రోజన్ పెరాక్సైడ్స్ కూడా జుట్టు తెల్లబడడానికి కారణం అవుతాయి. ఇక ఈ రోజుల్లో చిన్న వయసు వారికి కూడా జుట్టు తెల్లగా అవుతుంది. దానికి కారణం పొల్యూషన్, మంచి ఆహారం తీసుకోకపోవడం. అలాగే శరీరంలో విటమిన్ బీ12 లేనప్పుడు కూడా జుట్టు నరవడం మొదలవుతుంది.
అయితే చాలామంది ఈ సమస్యను దూరం చేసుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు . అయితే దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతున్నారు. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాపీ యొక్క సహజ మాస్కులు అప్లై చేసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. దీనిని ఇంట్లో సులభంగా సిద్ధం చేసుకోవచ్చు.దీన్ని తయారుచేసుకోవడానికి రెండు చెంచాల సేంద్రియ కాపీపొడి ,అలాగే రెండు చెంచాల కండిషనర్ మరియు సగం గ్లాస్ నీరును తీసుకోవాలి. ఇక ముందుగా ఒక పాత్రను తీసుకొని దాంట్లో నీళ్లు పోసి తక్కువ మంట మీద వేడి చేయాలి. ఆ వేడి నీటిలో కాఫీ పౌడర్ వేసి కాసేపు మరిగించాలి.

మరిగిన తర్వాత మంటను ఆపేసి నీటిని చల్లార్చుకోవాలి. ఇక దీనిలో కండిషనర్ ను వేసి బాగా ,కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక దీనిని ఉపయోగించే ముందు తల స్నానం చేయాలి. తలస్నానం చేసి తర్వాత జుట్టును బాగా తడి పోయేంతవరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఈ కాపీ రంగును జుట్టుపై అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట దీన్ని అలాగే ఆరనించి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఎయిర్ మాస్క్ మీ జుట్టు ఒక వారం పాటు నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇక మీరు ఆ జుట్టును ఎలా చూసుకుంటారో దానిపైనే అది ఎంతకాలం ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. దీనిని ఉపయోగించడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు…