Health Tips : మీరు యూరిక్ యాసిడ్ నియంత్రించాలనుకుంటే ఈ ఆహారాన్ని అసలు తినకూడదు. ఇలా చేయడం ద్వారా నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్ అనేది ప్రతి ఒక్కరిలో తయారయ్యే టాక్సిన్. యూరిక్ యాసిడ్ ను ఫిల్టర్ చేయడం ద్వారా తొలగించవచ్చు. యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారా తొలగించలేనప్పుడు ఇది కిళ్లలో స్పటికాల రూపంలో ఉండిపోతాయి. తద్వార కీళ్ల నొప్పులు,వేళ్ళు వాపు ,పాదాలు , చేతులు వేళ్లలో నొప్పులు వస్తాయి. అయితే ప్యూరిన్ ఆహారం ను ఎక్కువగా తీసుకోడం వలన యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
యూరిక్ యాసిడ్ అధికంగా పెరగడానికి గల కారణం మనం తీసుకునే ఆహారం. ఐస్ క్రీమ్ , సోడా , ఫాస్ట్ వంటి , వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఈ యూరిక్ యాసిడ్ నియంత్రించాలంటే మీరు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించాలి. యూరిక్ యాసిడ్ రోగులు కొన్ని పుల్లని లేదా తీయని పదార్థాలను తీసుకుంటే ఎక్కువ సమస్యకు గురవుతారు.కావున వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. అయితే ఎలాంటి ఆహారాన్ని దూరంగా ఉంచడం వలన యూరిక్ యాసీడ్ ను త్వరగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.చింతపండు అసలు తినకూడదు : యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు చింతపండును అసలు తినకూడదు.

చింతపండు లో ఉండే ప్రక్టోజ్ శరీరంలోని యూరిక్ ఆసిడ్ ను ఎక్కువ చేస్తుంది. కావున యూరిక్ యాసిడ్ గల రోగులు దీనిని అస్సలు ముట్టుకోకూడదు .ఖర్జూరాలకు దూరంగా ఉండాలి :అలాగే యూరిక్ ఆసిడ్ గలవారు ఖర్జూరాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఖర్జూరాలొ ప్రక్టోజు అధికంగా ఉంటుంది. ఇది ప్యూరిక్ యాసిడ్ ను అధికంగా పెంచుతుంది. కావున ఖర్జూరాలకు దూరంగా ఉండాలి. అలాగే చీకు అనే పండును కూడా ఈ రోగులు అస్సలు తినకూడదు. ఇది తినడానికి తియ్యగా ఆరోగ్యపరంగా ప్రయోజనకరమైన పండు.కానీ దీనిలో కూడా ప్రక్టోజ్ అధికంగా ఉంటుంది. కావున యూరిక్ యాసిడ్ కలవారికి ఇది అంత మంచిది కాదు.