Zodiac Signs : వృషభ రాశి వారికి అక్టోబర్ నెల 2022 లో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గ్రహ స్థితి గురించి తెలుసుకుందాం. ఈ నెలలో నాలుగు గ్రహాల మార్పు జరగనుంది. మేషరాశిలో రాహువు యొక్క సంచారం , తులా రాశిలో కేతువు, మకరంలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. అలాగే మీనంలో వక్రించిన గురువు యొక్క ఒక్క సంచారం జరుగుతుంది. వృషభంలో ఉన్న కుజుడు మిధునంలోకి చేరుతున్నాడు. అలాగే కన్యారాశిలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. ఈ గ్రహస్థితిని అనుసరించి వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో పార్ట్నర్ షిప్ ఉన్నప్పటికీ సొంతంగా నిర్ణయాలను తీసుకొని విజయాన్ని సాధిస్తారు. రైతులకి, కన్ స్ట్రక్షన్ బిజినెస్ ల వారికి, మెడికల్ రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. రాజకీయ నాయకులకు కొద్దిగా ఒత్తిడి ఉన్న సరైన ఫలితాలను అందుకుంటారు. రుణం ఇచ్చే విషయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అయినా సక్సెస్ ని అందుకుంటారు. వివాహ సంబంధిత విషయాలలో కొంచెం జాగ్రత్తలు వహించాలి. కొత్త ఉద్యోగాలు నూటికి నూరు శాతం వస్తాయి.

ఇన్వెస్ట్మెంట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లోన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోదర వర్గం నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అదేవిధంగా ఈ వారంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చక్కని ఫలితాలు రానున్నాయి. అయితే వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో అన్ని విధాలు చక్కగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే సూర్య భగవానుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది.