Zodiac Signs : అక్టోబర్ 15 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Advertisement

మేషం : మీరు అనుకున్న పనులను నెరవేర్చుతారు. మీ ధైర్యం, పట్టుదలే మిమ్మల్ని మీ లక్ష్యం చేరుకునేలా చేస్తుంది. మీ పార్టనర్ తో మీకు చాలా సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య అన్యోన్యం పెరుగుతుంది. ఈరోజు మీకు డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఇవాళ ఆరోగ్యంగా ఉంటారు. వృషభం : మీరు చేయాల్సిన పనులు వెంటనే పూర్తి చేయాలి. మీకు ఎక్కువ సమయం దొరకదు. చాలా తెలివిగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. వృత్తిరిత్యా ఉద్యోగం చేసేవాళ్లకు తమ బాస్ నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ పార్టనర్ తో అంత సఖ్యతగా ఉండరు. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. చాలా తెలివిగా డబ్బు ఖర్చు పెట్టాలి. పలు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

Advertisement

మిథునం : సంతోషంగా, రిలాక్స్ గా ఉండాల్సిన సమయం ఇది. మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిందే. మీరు చేసే పనిలో మీకు అంతగా సంతృప్తి ఉండదు. చాలా జాగ్రత్త, పట్టుదలతో మీ పనులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మీ పార్టనర్ తో చాలా ఫ్రీగా ఉండాలి. అప్పుడే మీ పార్టనర్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఖర్చులు పెరగడం వల్ల కొంచెం ఒత్తిడికి లోనవుతారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని టెన్షన్ పెడతాయి. కర్కాటకం : ఒత్తిడి పెరుగుతుంది. దాని వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే యోగాను ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు పని చేసే చోట మీ కింది స్థాయి మహిళా ఉద్యోగినిలతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలోనూ సమస్యలు వస్తాయి. దాని వల్ల మీ పార్టనర్ తో సరిగ్గా సమయం గడపలేరు. మీ పార్టనర్ తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

Advertisement
Today Horoscope October 15 2022 Check Your Zodiac Signs
Today Horoscope October 15 2022 Check Your Zodiac Signs

సింహం : ఈరోజు మీకు చాలా బాగుంటుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ తెలివే మీకు పెట్టుబడి. వృత్తిలో మీకు మంచి పేరుస్తుంది. పనులన్నీ వెంటనే పూర్తి చేస్తారు. దాని వల్ల మీతోటి ఉద్యోగులకు మీ మీద అసూయ పుడుతుంది. మీ పార్టనర్ తో సత్సంబంధాలు నెరుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అవసరానికే డబ్బులు ఖర్చుపెడతారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.

కన్య :  తక్కువ శ్రమతో ఎక్కువ పనిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు ఎలాంటి కష్టమైన పనులను అయినా చాలా ఈజీగా పరిష్కరిస్తారు. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. పార్టనర్ తో సంతోషంగా ఉంటారు. వృథా ఖర్చులు చేయరు. ఈరోజు చాలా ఫ్రెష్ గా, సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.

తుల : పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. సహనం చాలా అవసరం. పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తివ్యాపారాల్లో ఉన్నవాళ్లు తమ తోటి ఉద్యోగుల గురించి తెలుసుకోవడం మంచిది. పార్టనర్ తో సంతోషంగా గడుపుతారు. డబ్బుల కోసం లోన్లు తీసుకుంటారు. అయినా కూడా మీ డబ్బు అవసరాలు ఆ లోన్ ద్వారా తీరవు. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

వృశ్చికం : సహనం చాలా ముఖ్యం. పట్టుదల, ఉత్సాహం చాలా అవసరం. అవే మీ పనులను నెరవేర్చుతాయి. పార్టనర్ తో గొడవ జరుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దాని వల్ల డబ్బు సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చాలా ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

ధనుస్సు : మెడిటేషన్ చేయండి. మీరు ఎలాంటి పనులనైనా నెరవేర్చగలరు. మెడిటేషన్, దేవుడిని పూజించడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు తమ పనులను పూర్తి చేస్తారు. పలు కఠినమైన పనులను మేనేజ్ చేయలేరు. పార్టనర్ తో సరిగ్గా ఉండలేరు. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు దరిచేరవు.

మకరం : మీ ధైర్యం, మీ పట్టుదలే మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. వృత్తిరిత్యా ఉద్యోగాలు చేసేవాళ్లకు మంచి కలుగుతుంది. పని బాగా చేసి బాస్ మెచ్చుకునేలా ప్రవర్తిస్తారు. తద్వారా ఇన్సెంటివ్స్ లభిస్తాయి. పార్టనర్ తో చాలా ఆనందంగా ఉంటారు. డబ్బు విషయంలో ఎలాంటి కొదవ ఉండదు. పెట్టుబడులు పెడతారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.

కుంభం : మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి కానీ.. వృత్తిరీత్యా ఉద్యోగం చేసేవాళ్లకు చాలా సమస్యలు వస్తాయి. అనుకున్న సమయానికి ఉద్యోగంలో పని పూర్తి చేయలేకపోతారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్య సమస్యలు స్థాయితాయి.

మీనం :  అనుకున్న పనులు వెంటనే పూర్తి కావు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు తోటి ఉద్యోగులతో చక్కగా ఉండాలి. అప్పుడే ఉద్యోగానికి సంబంధించిన వర్క్ త్వరగా పూర్తవుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు ఏర్పడుతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయి. పలు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

Advertisement