Zodiac Signs : అక్టోబర్ 18 మంగళవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

Zodiac Signs : మేష రాశి : ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. మిమ్మల్ని మీరు చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు తమ వర్క్ ను ప్లాన్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఫోకస్ తప్పితే ఇక అంతే. మీ భాగస్వామితోనూ సమస్యలు వస్తాయి. అందుకే వాళ్లతో సఖ్యతతో మెలగండి. ఈ రోజు తక్కువ సంపాదన ఉంటుంది. ఎక్కువ ఖర్చులు ఉంటాయి. అందుకే డబ్బులను మేనేజ్ చేయలేరు. అనారోగ్యం బాధిస్తుంది. వృషభ రాశి : ఈరోజు మీకు అనుకూలమైన రోజు. మీ ఎనర్జీ లేవల్స్ కు హేట్సాఫ్. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. అన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా మంచి రోజు. మీ ప్రతిభను బాస్ గుర్తిస్తారు. ఎంతటి కష్టమైన పనులైనా ఈజీగా పూర్తి చేస్తారు. భాగస్వామి విషయంలో మాత్రం మీరు కొంచెం శ్రద్ధ వహించాలి. కూల్ గా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. పెట్టుబడులు పెడతారు. డబ్బు ఆదా చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

Advertisement

మిధున రాశి : ఈరోజు మీకు అనుకూలమైనది కాదు. పరిస్థితులేవీ మీకు అనుకూలించవు. దుర్బరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మీరు చేసే ప్రతి పనిని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పని చేసేవాళ్లకు పని ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామితో కొన్ని మనస్పర్థలు వస్తాయి. డబ్బులు కూడా వృధాగా ఖర్చవుతాయి. ఇప్పటికైనా వృధా ఖర్చును ఆపేస్తే డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఆరోగ్యం సహకరించదు. కర్కాటక రాశి : ఒత్తిడి తగ్గించుకోండి. ఒత్తిడిని దూరం చేసే ప్రత్యామ్నాయాలను వెతకండి. లేదంటే అది మీ సంతోషాన్నే హరించేస్తుంది. అందుకే ముఖ్యమైన నిర్ణయాలను ఇవాళ తీసుకోకండి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామితోనూ సఖ్యతగా ఉండలేరు. డబ్బులు కూడా సమస్య తీసుకొస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బు వెచ్చించాల్సి వస్తుంది.

Advertisement
Today Horoscope October 18 2022 Check Your Zodiac Signs
Today Horoscope October 18 2022 Check Your Zodiac Signs

సింహ రాశి : మీరు చాలా స్ట్రాంగ్ గా, పట్టుదలతో ఉండాలి. మీరు చాలా ధైర్యంగానూ ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో పలు సమస్యలు వస్తాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితోనూ సఖ్యతగా ఉండరు. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం బాధిస్తుంది.

కన్య రాశి : కన్యా రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. అనుకూల దినం. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉంటారు. డబ్బుల విషయంలోనే కొంచెం సమస్యలు వస్తాయి. కానీ.. అప్పు తీసుకొని డబ్బు సమస్యను తీర్చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

తుల రాశి : ఈరోజు మీకు అనుకూలమైన రోజు. మీ నమ్మకాన్ని కోల్పోకండి. మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు కూడా అనుకూలమైన రోజు. మీ ప్రతిభను పై అధికారి మెచ్చుకుంటారు. మీ పార్టనర్ తో సఖ్యతతో ఉంటారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి : మీరు అనుకున్న పనులేవీ పూర్తి కావు. సానుకూల దృక్పథంతో ఉండండి. జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగండి. ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి.

ధనస్సు రాశి : మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. దానికి ప్రత్యామ్నాయం వెతుక్కోండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు పని విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో కాస్త సఖ్యతతో మెలగండి. ధనవ్యయం ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మకర రాశి : ఈరోజు మీకు చాలా అనుకూలమైన దినం. మీ కష్టాన్ని నమ్ముకుంటారు. మీరు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు సరికొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కుంభ రాశి : ఈరోజు మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. మీ పట్టుదలే మీకు ఆయుధం. అస్సలు తగ్గరు. అవే మీకు విజయాన్ని తీసుకొస్తాయి. పాజిటివ్ రిజల్ట్స్ ను తీసుకొస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ల ప్రతిభను బాస్ గుర్తిస్తారు. జీవిత భాగస్వామితో ప్రయాణం చేస్తారు. డబ్బులకు ఎలాంటి సమస్య ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది.

మీన రాశి : మీకు సహనం చాలా అవసరం. ఏమాత్రం తొందరపడినా మొదటికే మోసం వస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. డబ్బు సమస్య వేధిస్తుంది.

Advertisement