Zodiac Signs : అక్టోబర్ 19 బుధవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

Zodiac Signs : మేష రాశి : ఈరోజు మీరు చేయాల్సిన పనులన్నీ సకాలంలో పూర్తి కావు. అడ్డంకులు వస్తాయి. మీరు ప్రశాంతంగా ఉండాలంటే దానికి మీరే కారణమవ్వాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ల పనులు కూడా సకాలంలో పూర్తి కావు. ఇక.. మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగలేరు. వాళ్లతో మంచిగా ఉండేందుకు ప్రయత్నించండి. ఖర్చులు పెరుగుతాయి. రాబడి తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే అవుతుంది. చాలా అనుకూలమైన రోజు. ఉత్సాహంగా కనిపిస్తారు. అనుకున్న పనులన్నీ వెను వెంటనే నెరవేరుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు కూడా ఈ రోజు తమ పనులన్నీ పూర్తిచేస్తారు. ఆఫీసులో మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవిత భాగస్వామి విషయంలోనే కాస్త శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.

Advertisement

మిధున రాశి : ఈ రాశి వారు ఏది అనుకున్నా ఈరోజు పనులు పూర్తి కావు. పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఏ పని చేసినా సరైన ప్లానింగ్ ఉండాలి. లేకపోతే ఏం చేయలేరు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు పని ఒత్తిడితో పాటు పని భారం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు పెరుగుతాయి. అలాగే.. వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. కర్కాటక రాశి : ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది. లేకపోతే ఒత్తిడే మీకు పెద్ద శత్రువుగా మారుతుంది. అది పని ఒత్తిడి కావచ్చు.. ఇతర ఒత్తిడులు కావచ్చు. ఆ ఒత్తిడి వల్లనే భాగస్వామితోనూ గొడవలు అవుతాయి. డబ్బులు ఖర్చవుతాయి. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. వాళ్ల ట్రీట్ మెంట్ కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది.

Advertisement
zodiac signs today horoscope 19 october 2022
zodiac signs today horoscope 19 october 2022

సింహ రాశి : ఈ రాశి వాళ్లు గట్టి హృదయం కలవారు. వీళ్లలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేస్తారు. అప్పుడే మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగంలో వచ్చే సమస్యలు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ.. పని ఒత్తిడి పెరగడం వల్ల అటు ఇంట్లో జీవిత భాగస్వామితోనూ సఖ్యతగా ఉండలేరు. మరోవైపు ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి.

కన్య రాశి : ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన రోజు. తలపెట్టిన పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకొని వాటిని అవలంబిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు మాత్రం బాధిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

తుల రాశి : ఈ రాశి వారికి ఈరోజు మంచి రోజు కానీ.. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. వృత్తి రీత్యా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు కూడా తమ పనులను పూర్తి చేసుకుంటారు. ఆఫీసులో ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. డబ్బుల విషయంలోనే కాస్త ఆచీతూచీ అడుగు వేయాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలి. అనుకున్న పనులేవీ పూర్తి కావు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కానీ.. ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఇబ్బంది పెడతాయి. అలాగే.. ఆరోగ్యం సహకరించదు. కొన్ని సమస్యలు వేధిస్తాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉండాలి. మానసికంగా ఇబ్బందులు రావడంతో అనుకున్న పనులేవీ పూర్తి కావు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పని చేసేవాళ్లు.. తమ వర్క్ విషయంలో ఎక్కువ దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి. ఆకస్మిక ధనవ్యయం ఉంటుంది. అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువ టెన్షన్ పడతారు.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. వాళ్లు ఏది అనుకుంటే అది జరుగుతుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్లు రాణిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు సకాలంలో తమ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉంటారు. భాగస్వామితో కలిసి ప్రయాణాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మీన రాశి : ఈ రాశి వాళ్లు చాలా సహనంతో ఉండాలి. ఏమాత్రం తొందరపడకూడదు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు చాలా కష్టపడాలి. అనుకున్న పనులేవీ త్వరగా పూర్తి కావు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి కానీ.. ఆరోగ్యం బాగుంటుంది.

Advertisement