Zodiac Signs : మేషం : ఈరోజు మీకు చాలా బాగుంటుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ.. ఉద్యోగం, వ్యాపార రంగంలో ఉన్నవాళ్లు తోటి ఉద్యోగులతో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీ పాజిటివ్ దృక్పథం మిమ్మల్ని ఇటువంటి సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. మిమ్మల్ని మీరు ఫోకస్ గా ఉండేలా చూసుకోండి. భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. వృధా ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.వృషభం : ఈ రోజు మీరు ఒత్తిడిని ఎదుర్కునే అవకాశం ఉంది. బ్రేక్ తీసుకోండి. మ్యూజిక్ వినండి. రిలాక్స్ గా ఉండండి. మీ ఉద్యోగంలో పలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భాగస్వామితో మంచిగా మెలగండి. ఆర్థికంగా బాగుంటుంది. డబ్బులు ఆదా చేస్తారు. ఖర్చులు తగ్గుతాయి. కాలు నొప్పి బాధిస్తుంది. ఆరోగ్యం బాధిస్తుంది.
మిథునం : ఈరోజు మీకు ఏం బాగుండదు. పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. వృత్తిరీత్యా ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారస్తులకు ఈరోజు చాలెంజింగ్ గా ఉంటుంది. మీ పనులను ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవడం మంచిది. మీ భాగస్వామితో సఖ్యతతో మెలగండి. ప్రయాణాల్లో, ఇతర సమయాల్లో డబ్బును వృధా చేసుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటకం : మీకు వచ్చే సమస్యలను మీరే అధిగమించాలి. మీకు ఉన్న కమిట్ మెంట్స్ వల్ల అలాంటి సమస్యలు వస్తాయి. వృత్తి రీత్యా ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు తమ పనిని బాగా నిర్వర్తిస్తారు. మీ ప్రతిభకు మెచ్చి ప్రమోషన్స్ కూడా దక్కుతాయి. మీ భాగస్వామి విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండాలి. అదే మీ భాగస్వామికి నచ్చుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మెడికల్ ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం బాధిస్తుంది.

సింహం : ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు కూడా తమ పనులను సరిగ్గా నిర్వహించగలుగుతారు. భాగస్వామితో సరదాగా ఉంటారు. ఆర్థికంగా బాగుంటారు. డబ్బులను సేవ్ చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య : ఎక్కువగా కష్టపడితే ఎక్కువగా సంతోషంగా ఉంటారు. మీరేంటో నిరూపించే రోజు ఇది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు తమ పనులను సరిగ్గా నిర్వర్తిస్తారు. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఆర్థిక సమస్యలు ఉండవు. డబ్బులు ఆదా చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
తుల : మీ మనసుతో ఆలోచించండి. ఈరోజును సరిగ్గా ప్లాన్ చేసుకోండి. కొన్ని సార్లు మీరు సహనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చాలా సహనంతో ఉండాలి. రిలాక్స్ గా ఉండాలి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవాళ్లకు పని ఒత్తిడి ఉంటుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అప్పులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చులు అధికం అవుతాయి. మీ కుటుంబ సభ్యులను అనారోగ్యం బాధిస్తుంది.
వృశ్చికం : మీరు అనుకున్న పనులు నెరవేరాలంటే మీరు ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీకు అంతగా అచ్చి రాదు. కష్టపడితేనే పనులు పూర్తవుతాయి. నమ్మకాన్ని కోల్పోకండి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవాళ్లకు కూడా జాబ్ లో సమస్యలు తప్పవు. మీ భాగస్వామితో అంతగా సఖ్యతతో ఉండరు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ధనస్సు : దనస్సు రాశి వారికి ఈరోజు అనుకూల దినం. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు బాగుంటుంది. కానీ.. పని ఒత్తిడి మాత్రం పెరుగుతుంది. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా బాగానే ఉన్నా.. కొంత మేర ఖర్చులు పెరుగుతాయి. దీంతో కొన్ని రకాల లోన్స్ తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
మకరం : మీ పాజిటివ్ దృక్పథమే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేలా చేస్తుంది. మీరు ఎంత పాజిటివ్ గా ఉంటే మీరు అంతగా సక్సెస్ కాగలరు. ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి కొన్ని సమస్యలు తప్పవు. మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం : మీరు చేసే పనుల మీద మీకు క్లారిటీ ఉంటే మంచిది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్లకు చాలెంజెస్ ఉంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామితో అంటీముట్టనట్టే ఉంటారు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
మీనం : మీ పని విషయంలో ఓపిక అవసరం. మీ పనులను సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవాళ్లకు గుర్తింపు లభిస్తుంది. మీ భాగస్వామితో సరిగ్గా ఉండేలేరు. దానికి కారణం మీ స్ట్రెస్. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి.