Adipurush : సోషల్ మీడియాలో ఏదైనా ప్రచారం జరుగుతుంది. నెగెటివ్ అయినా పాజిటివ్ అయినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాకు అదే జరుగుతోంది. ప్రభాస్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ తీస్తున్నాడు. ఆదిపురుష్ సినిమాను చాలా చాలెంజింగ్ గా తీసుకున్నాడు. సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఆదిపురుష్ సినిమాకు తీవ్రంగా హైప్ వచ్చింది.కానీ.. సినిమా టీజర్ చూసి మాత్రం ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఊసురుమన్నారు. మొదట్లోనే ఈ సినిమాకు ఇంత నెగెటివిటీ రావడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోయారు.
దానికి కారణం సినిమా టీజర్ చిన్నపిల్లల కోసం వచ్చే కార్టూన్ షోలా ఉండటం. గ్రాఫిక్స్ కూడా నాసిరకంగా ఉందని.. అసలు ఇలాంటి టీజర్ ఆదిపురుష్ మూవీ టీమ్ నుంచి వస్తుందని ఊహించలేదని సినిమా అభిమానులు బాధపడుతున్నారు. టీజర్ లో వాడిన గ్రాఫిక్స్ మీదనే ఎక్కువగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడం, వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉందంటూ వార్తలు రావడంతో మూవీ యూనిట్ లో షాక్ లో ఉందట. అందుకే.. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో త్రీడీ వర్షన్ ను మీడియాకు కూడా ప్రదర్శించింది మూవీ యూనిట్. త్రీడీ వర్షన్ ను చూసి మూవీ యూనిట్ బాగానే పొగిడింది.

Adipurush : గ్రాఫిక్స్ మీదనే ఎక్కువగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్
అయినా కూడా ఆదిపురుష్ సినిమా మీద ఉన్న అనుమానాలు మాత్రం ఇంకా పోవడం లేదు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి చివరకు కార్టూన్ నెట్ వర్క్ సినిమాను తీశారా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆదిపురుష్ డైరెక్టర్ రావత్ కు టెన్షన్ పట్టుకుందట. టీజర్ లో రాముడిని, ఆంజనేయుడిని రామాయణాన్ని అవమానించేలా చూపించారంటూ కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. చూద్దాం మరి సినిమా విడుదలయ్యే నాటికి ఇంకా ఎన్ని సమస్యలు చుట్టుముట్టుతాయో.