Famous Actor : నటుడు అజయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లుదు. విక్రమార్కుడిలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి.. అనంతరం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా కూడా చేసాడు. .తెలుగు లో ఒక్కడు,విక్రమార్కుడు, సై, దేశ ముదురు, ఛత్రపతి వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు అజయ్. అయితే ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అజయ్ ఈ మధ్యకాలంలో సినిమాలలో అంతగా కనిపించడం లేదు.చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘9 అవర్స్’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ద్వారా సినీ ప్రియులను పలకరించాడు. తన సినీ ప్రస్థానం కష్టాల గురించి ఎమోషనల్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి.. తాను ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నాడనే విషయాల గురించి ఓపెన్ అయ్యాడు.
19 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి నేపాల్ వెళ్లిన అజయ్… అక్కడ డబ్బులు లేక హోటల్ లో గిన్నెలు తోమి డబ్బులు సంపాదించుకుని ఇంటికి వచ్చాడు. ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నాడు అజయ్. ఎంతో కష్టపడి వచ్చిన నటుల్లో అజయ్ కూడా ఒకరు కావడం గమనార్హం. తనకు సినిమాలకు మధ్య విరామం రావడానికి గల కారణాలను వివరించాడు. తగిన పాత్రలు రాకపోతే నటించడానికి నిర్మొహమాటంగా నో చెప్పడం అజయ్ కు అలవాటు. శ్రీమహాలక్ష్మి సినిమాలో ఓ రేప్ సన్నివేశంలో నటించేటప్పుడు చేయి పట్టుకోవడంతో ఆమె గట్టిగా అరవడంతో ఇక ఆ సీన్ చేయలేనని చెప్పాడట అజయ్. అందరి ముందు రేప్ సీన్ లో నటించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎక్కువగా అలాంటి సీన్లలో నటించను అంటున్నాడు.

Famous Actor : క్లారిటీ ఇచ్చాడు..
అజయ్ ఇటీవల కాలంలో సరైన పాత్రలు రాకపోవడంతో నటించడం లేదు. దీంతో విరామం రావడంతో అందరు అడుగుతున్నారు. తగిన పాత్రలు వస్తే నటించడానికి ఎప్పుడు సిద్ధమేనని అజయ్ చెబుతున్నాడు. ‘నేనెప్పుడూ పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నటించాను. గత 22 ఏళ్లుగా చేసింది కూడా అదే. ఇప్పుడూ అదే చేస్తున్నా.. సినిమాల్లో మన పాత్ర ఎంత సేపు ఉంది.? ఎన్ని సార్లు కనిపించింది అని కాకుండా ఎంత ప్రభావవంతంగా ఉందనేది పరిగణలోకి తీసుకుంటాను. ఇన్నాళ్లు ఎందుకు సినిమాలు చేయలేదంటే.. నాకు తగిన పాత్రలు దొరకలేదు. అందుకే మధ్యలో గ్యాప్ తీసుకున్నాను.. ’ అంటూ అసలు సంగతిని వివరించాడు.