Allu Arjun : సినిమా పరిశ్రమ స్థాయి పెరిగింది. హీరోలు, దర్శకులు తమ ప్రతిభని చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచగా, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో తెలుగోడి సత్తా ఏంటో నిరూపించాడు. ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప రాజ్ హవా కొనసాగుతోంది. సౌత్, నార్త్, ఇంటర్నేషనల్ అని ఏ తేడా లేకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో పాటు ఆయన చెప్పిన డైలాగ్స్ వినపడుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప మానియాకి ఫిదా అయ్యారు.
పుష్ప రాజ్ నటనకు యావత్ ప్రపంచం బ్రహ్మరథం పట్టింది. ఇక ఇప్పటికే పుష్ప సినిమాకు ఫిలీం ఫేర్ 67 అవార్డుల మహోత్సవంలో ఏకంగా 7 అవార్డులు రాగా, సైమా అవార్డులను కూడా వరించింది. ప్రతి చోట పుష్ప ర్యాంపేజ్ నడుస్తుంది. అయితే తాజాగా ఎంటర్టైన్ కేటగిరిలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు బన్నీ. సినిమా ఇండస్ట్రీలో గత 20 ఏళ్లలో ఉత్తరాది నుంచి దక్షిణ భారత నటుడుకి అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డుకెక్కాడు. 2015 వ సంవత్సరం బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగింపచేసిన రాజమౌళికి అప్పట్లో ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు తో సత్కరించింది.

Allu Arjun : దటీజ్ బన్నీ..
ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలకు హాజరైన మహిళా, శిశు, సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. కాగా ఈ కేటిగిరీలో బన్నీతోపాటు రాజమౌళి (RRR), వివేక్ అగ్నిహోత్రి (ది కశ్మీర్ ఫైల్స్), అలియా భట్ (గంగూభాయి కతియావాడి), కార్తిక్ ఆర్యన్ (భూల్ భులయ్యా 2) నామినేట్ అయ్యారు. అయితే వీరందరిలోకి ఈ అవార్డుకు అల్లు అర్జున్ (పుష్ప) ను ఎంపిక చేసింది ఈ జ్యూరి. అల్లు అర్జున్‌కి ఈ అవార్డ్ దక్కడంతో బన్నీ అభిమానులు ఖుష్ అవుతున్నారు. అంతేకాదు మహేష్ అభిమానులతో రచ్చకు దిగుతున్నారు. మా హీరో స్టామినా ఇది అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.