Hair Tips : ప్రస్తుత కాలంలో వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఆడ మగ అలాగే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అతి చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రావడం వలన నలుగురిలో తిరగాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పాలి. ఆ తెల్ల వెంట్రుకలు కనిపించకుండా ఉండడం కోసం రకరకాల హెయిర్ కలర్స్ ను ఉపయోగిస్తున్నారు. ఎయిర్ కలర్స్ ఉపయోగించడం వలన వాటిలో ఉండే కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ దారి తీస్తున్నాయి.అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా న్యాచురల్ గా ఈ క్రీమ్ ను అప్లై చేసుకోవడం ద్వారా తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవచ్చు.
దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత దానిలో రెండు స్పూన్స్ టీ పొడిని వేసి మరిగించుకోవాలి. అలాగే దానిలో 10 లవంగం మొగ్గలను వేసి బాగా మరిగించుకోవాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దానిలో కొంచెం కాపీ పౌడర్ కూడా కలుపుకొని పక్కన పెట్టాలి. తర్వాత రెండు బీట్రూట్ లను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వడకట్టి జ్యూస్ ను వేరు చేయాలి. తర్వాత ఒక కళాయి తీసుకుని మనం ముందుగా మరిగించి పెట్టుకున్న డికాషన్ ను వేసుకోవాలి.

తర్వాత దీనిలో బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. దీనిలో కేస రంజని పౌడర్ కలుపుకోవాలి. కేస రంజని పౌడర్ అన్ని రకాల ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది. దీన్ని పలుచగా కాకుండా టైట్ గా కాకుండా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకొని రాత్రంతా మూత పెట్టుకోవాలి. ఉదయం మూత తీసి ఒకసారి కలుపుకొని జుట్టుకు అప్లై చేసుకోవాలి. అయితే ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది . అలాగే అప్లై చేసుకున్న ఒక గంట తర్వాత షాంపూ లేకుండా కేవలం వాటర్ తోనే వాష్ చేసుకోవాలి. ఇలా 15 రోజులకు ఒకసారి చేయడం వల్ల తెల్ల వెంట్రుకలు మొత్తం పోయి జుట్టు నల్లగా మారుతుంది.