WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ అనేది తప్పని సరి కాగా, ఇది లేకపోతే బ్రతకలేం అన్నట్టుగా కొందరి పరిస్థితి మారింది. చాలా మంది ప్రజలు చాలా ఇన్ స్టాంట్ మెసేజ్ ల కోసం దీనిని ఉపయోగిస్తారు. ఈ యాప్ వ్యక్తిగత చాట్ నుంచి అధికారిక చాట్ వరకు ప్రతి ఒక్కరికీ ఉపయోగిస్తున్నారు. ఫ్యామిలీతో మాట్లాడుకోవాలన్నా లేదా ఆఫీసు పని అయినా… దేనికైనా ఈ కమ్యూనికేషన్ మాధ్యమం ద్వారానే సంభాషించుకుంటుంటాం. పెరిగిన వాట్సాప్ ప్రాముఖ్యతతో చాలా బ్యాంకులు తమ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాయి. అయితే వాట్సాప్ చాటింగ్ బహిరంగ ప్రదేశాలలో చేయాలంటే కొందరికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ప్రయాణం సమయంలో అయితే చాట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్నవారు చాటింగ్ చేయడం వలన కొంత అసౌకర్యంగానే ఉంటుంది. ఈ అసౌకర్యం నివారించడానికి సరికొత్త చిట్కా వచ్చేసింది. మీ ఫోన్ స్క్రీన్‌పై మీ పక్కన కూర్చున్న వ్యక్తులు చదవకుండా ఉండేందుకు కర్టెన్ వర్చువల్ అనే ఆప్ వచ్చింది. దీనిని ఆన్ చేశారో మీ పక్కన ఉన్న వారు ఫోన్లోని వాట్సాప్ సందేశాలను ఏ మాత్రం చదివే అవకాశం ఉండదు. ఈ యాప్ కోసం ప్లే స్టోర్‌కి వెళ్లి అక్కడ MaskChat-Hides Chat యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.యాప్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత, సెటింగ్స్ మార్చుకోవాలి.

WhatsApp : బెస్ట్ ఆప్షన్..
ఎలాంటి స్క్రీన్ కావాలని అనుకుంటున్నారో అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇది యాడ్స్ తో కూడిన యాప్ అన్నమాట. యాడ్ ఫ్రీ యాప్ కావాలంటే సభ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది. ఈ యాప్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత ఇతర యాప్‌లను చూడకుండా వర్చువల్ స్క్రీన్‌గా పని చేస్తుంది. మీరు ఈ యాప్‌ని ఓపెన్ చేసినప్పుడు, మీకు స్క్రీన్‌పై ఫ్లోటింగ్ మాస్క్ ఐకాన్ కనిపిస్తుంది. అయితే మీ వాట్సాప్ స్క్రీన్ రహస్యంగా ఉంచాలని అనుకున్నప్పుడు దానిని ఆన్ చేయవలసి ఉంటుది. కర్టెన్ ఎంత పెద్దగా ఉంచాలి, ఎంత పారదర్శకంగా ఉంచాలి, అన్నీ సెట్ చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి యాప్ చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీరు ఇది ఎందుకు ట్రై చేయకూడదు.