Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ షురూ అయింది. దసరా, దీపావళి సందర్భంగా ఈ సేల్ ను ఫ్లిప్ కార్ట్ స్టార్ట్ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి అంటే ఈరోజు నుంచే సేల్ ప్రారంభం అయింది. స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు, ఇతర యాక్సెసరీస్ మీద భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అందుకే.. స్మార్ట్ ఫోన్లు కొనాలని ప్లాన్ చేసుకునే వాళ్లు ఈ సేల్ లో తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కు సెప్టెంబర్ 22 నుంచే ఈ సేల్ ప్రారంభం అయింది. సెప్టెంబర్ 23 నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే.. బడ్జెట్ ధరలో రూ.20 వేల లోపు బెస్ట్ ఫోన్లు కొనాలని అనుకునే వారు తక్కువ ధరకే బెస్ట్ ఫోన్లను ఈ సేల్ లో కొనుగోలు చేయొచ్చు. అందులో జియోమీ 11ఐ హైపర్ చార్జ్, సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 23 తో పాటు ఇంకా చాలా బ్రాండ్స్ ఫోన్లు ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ జియోమీ 11ఐ హైపర్ చార్జ్ అసలు ధర రూ.24,999 కానీ.. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కేవలం రూ.19,999 కే ఈ ఫోన్ ను చేజిక్కించుకోవచ్చు.

Flipkart Big Billion Days Sale : రూ.5 వేల డిస్కౌంట్ తో లభించనున్న జియోమీ 11ఐ హైపర్ చార్జ్
ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్ట్స్ ఉపయోగించే వాళ్లు 10 శాతం డిస్కౌంట్ పొందచ్చు. అలాగే. . ప్రీపెయిడ్ ఆర్డర్స్ మీద రూ.3500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లు కలిపి రూ.19,999 కే ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు. అలాగే రియల్ మీ ప్రో ప్లస్ ఫోన్ ను రూ.22,999 కే కొనుగోలు చేయొచ్చు. పలు డిస్కౌంట్లు పోను రూ.18,499 కే ఆ ఫోన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో లభించనుంది. సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 23 ఫోన్ ను కేవలం రూ.10,999 కే పొందొచ్చు. మోటో జీ52 ఫోన్ ను సేల్ లో డిస్కౌంట్ పోను రూ.11,699 కే పొందొచ్చు. రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్ ను డిస్కౌంట్ పోను రూ.14,999 కే చేజిక్కించుకోవచ్చు.