Bigg Boss 6 Telugu : మొగుడు పెళ్లాల‌కు అప్పుడే బిగ్ బాస్ గొడ‌వ పెట్టేశాడా.. పాపం వారి ప‌రిస్థితి దారుణం..!

Advertisement

Bigg Boss 6 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విదేశాల‌లో మొద‌లైన ఈ షో అన్ని చోట్ల మంచి ఆద‌ర‌ణ సంపాదించుకుంది. తెలుగులో అయితే ఈ షోకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అందుకే వ‌రుస పెట్టి సీజ‌న్స్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే బిగ్ బాస్ ఐదు సీజ‌న్స్ పూర్తి చేసుకోవ‌డంతో పాటు నాన్ స్టాప్ అనే ఓటీటీ షో కూడా జరుపుకుంది. తాజాగా సీజ‌న్ 6 లాంచ్ కాగా, ఇందులో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అందులో బాగా తెలిసిన ముఖాలు రెండు మూడు మించి లేవు. గతం కంటే ఈసారి మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సోమవారం నాడు నామినేషన్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే ఇక ఈ వారం కూడా ఎంటర్ అయిన రెండో రోజే నామినేషన్లు పెట్టడానికి ప్రయత్నించింది బిగ్ బాస్ టీం. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా కొంద‌రు టాస్క్‌లు ఆడుతూ నోటికి కూడా ప‌ని చెప్పారు. ముఖ్యంగా గ‌లాటా గీతూ.. ఇన‌య‌పై దారుణంగా నోరు పారేసుకుంది. త‌న‌కి ఎవ‌రు స‌పోర్ట్ ఇవ్వ‌డం లేదంటూ క‌న్నీరు కూడా పెట్టుకుంది. బిగ్ బాస్ షో అంటే వివాదాలు, అల‌క‌లు, ప్రేమ‌లు ఇలా ఉంటాయి. అయితే భార్య భ‌ర్త‌లు గా ఈ షోకి వెళ్లిన వాళ్లు విడిపోయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో ఫస్ట్ టైం భార్యాభర్తలకు ఎంట్రీ దొరికింది. హీరో వరుణ్ సందేశ్, వితిక షేరు హౌస్లోకి ప్రవేశించారు. మిగతా వాళ్లతో కంటే వారిద్దరే తరచుగా గొడవపడేవారు.

Advertisement
Bigg Boss 6 Telugu wife and husband fight
Bigg Boss 6 Telugu wife and husband fight

Bigg Boss 6 Telugu : నామినేష‌న్ ర‌చ్చ‌..

ఇక ఈ సీజ‌న్‌లో రోహిత్, మెరీనా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రెండో రోజు వాష్ రూమ్స్ దగ్గర మెరిన త‌న భర్త రోహిత్ కి గీతూ గురించి ఏదో చెప్పబోయింది. ఆ సమయంలో రోహిత్ అద్దంలో తన బాడీ చూసుకుంటున్నాడు. అది మెరిన కు నచ్చలేదు. నేను చెప్పింది అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ మండిప‌డింది. దానికి రోహిత్ మండిప‌డ్డాడు. ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌కు అనే స‌రికి ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ జ‌రిగింది. అయితే తిరిగి వాళ్లిద్ద‌రు మ‌ళ్ల‌లీ క‌లిసిపోతారు అనుకోండి.. అయితే తాజా ఎపిసోడ్‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌గా, నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కానట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురే నామినేషన్లోకి వచ్చారు. బాలాదిత్య, ఇనయ, అభినయ మాత్రమే నామినేషన్‌లో ఉన్నారు. వీరేనా లేకుంటే వేరే వారు ఎవ‌రైన నామినేష‌న్స్ లోకి వ‌స్తారా అన్న‌ది చూడాలి.

Advertisement