Amit Shah – NTR : గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒకటే చర్చ. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను కలవడంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. అసలు.. కేంద్ర హోంమంత్రి అయి ఉండి ఒక సినిమా నటుడిని కలవడం ఏంటి అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే.. అమిత్ షా.. జూనియర్ ను కలవడం వెనుక ఉన్న ఉద్దేశం వేరని.. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలోకి ఆహ్వానించడం కోసమే అమిత్ షా.. ఆయనను కలిశారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాడు బీజేపీ సీనియర్ నేత టీజీ వెంకటేశ్. నిజానికి ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు ఇప్పటికే వీళ్ల భేటీపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
దీంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. టీడీపీ పరిస్థితి ఏంటి.. టీడీపీని స్వాధీనం చేసుకుంటారా? చంద్రబాబు, లోకేశ్ పరిస్థితి ఏంటి? లేదంటే బీజేపీలో చేరుతారా అనే వార్తలు గుప్పుమన్నాయి.నిజానికి. 2018 ఎన్నికల్లో తెలంగాణ నుంచి తన సొంత అక్కడ సుహాసిని పోటీ చేస్తేనే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. కానీ.. 2009 ఎన్నికల్లో మాత్రం టీడీపీ తరుపున ప్రచారం చేశారు. ఇక.. ఆ తర్వాత రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలకు, రాజకీయ నాయకులకు ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు.

Amit Shah – NTR : సొంత అక్క పోటీ చేస్తేనే ప్రచారం చేయని జూనియర్ ఎన్టీఆర్
కేవలం సినిమాల మీదనే తన ఫోకస్ పెట్టారు. కానీ.. మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం తెలంగాణకు వచ్చిన అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను కలవడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. అయితే.. జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై తాజాగా బీజేపీ సీనియర్ నేత టీజీ వెంకటేశ్ స్పందించాడు. రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. సమీకరణలు కూడా మారుతుంటాయి.. అందులో భాగంగానే ఎన్టీఆర్, అమిత్ షాతో భేటీ అయ్యారు.. తప్పితే ఇందులో మర్మమేమీ లేదని వెంకటేశ్ తెలిపాడు. అంతదానికే బీజేపీలో ఎన్టీఆర్ చేరుతున్నట్టు కాదని క్లారిటీ ఇచ్చాడు. బీజేపీకి ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఏపీలో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ఇస్తున్నట్టు ఆయన గుర్తు చేశాడు.