BSNL Plans : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రోజు రోజుకి తన సేవలని విస్తరిస్తుంది. 5 జీ సేవలని కూడా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. తన 5G సేవలను అక్టోబర్ నెలలో ప్రారంభిస్తుందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతున్నారు మరోవైపు బీఎస్ఎన్ఎల్ తన 10,000 మొబైల్ టవర్లను విక్రయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ కింద మొత్తం 13,567 మొబైల్ టవర్లను విక్రయించడం ద్వారా 2025 నాటికి రూ.4,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 3జీ నెట్వర్క్ మాత్రమే అందుబాటులో ఉంది.
ఒకవేళ మీ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ 3జీ నెట్వర్క్ పుష్కలంగా ఉన్నట్టయితే.. ఈ ప్లాన్స్ పైసా వసూల్‌గా ఉంటాయి. ఐదు వందల రూపాయలలోపే బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్స్‌ని ప్రవేశపెడుతుంది. రూ.485 ప్లాన్ మంచి ప్రయోజనాలతో వస్తోంది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 82 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. ప్రతీ రోజు 1.5జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రోజులో 1.5జీబీ డేటా అయిపోతే 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇక రూ.499 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 80 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. ప్రతీ రోజు 2జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్లను వాడుకోవచ్చు.

BSNL Plans : మంచి ప్లాన్స్..
బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌తో పాటు జింగ్, ఎరోస్ నౌ ఓటీటీల సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. రోజులో 2జీబీ డేటా అయిపోతే 40కేబీపీఎస్ వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు. మరి ఈ రెండింట్లో ఏది బెస్ట్ ఆప్షన్ అంటే అందరు రూ.499కే ఓటు వేస్తున్నారు. 14 రూపాయలు అదనంగా చెల్లించడం వలన రోజుకు 0.5 డేటా అదనంగా రావడంతో పాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, జింగ్, ఎరోస్ నౌ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇక బీఎస్ఎన్ఎల్.. ఢిల్లీ, ముంబై మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో మొబైల్ సేవలను అందించేందుకు మొత్తం 68,000 టెలికాం టవర్లను కలిగి ఉంది. దేశంలో ఇంత భారీ టవర్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ మాత్రమే. రానున్న రోజులలో దశల వారీగా బీఎస్ఎన్ఎల్ తన సేవలను పెంచుకుంటూ పోనుంది.