TDP : 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ.. చంద్రబాబు కొన్ని పనులు చేయాలి. చంద్రబాబు ఏదో ఊరికే అలా టైమ్ పాస్ కు ప్రచారం చేస్తే.. ఏదో ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటే కాదు గెలిచేది.. చంద్రబాబు ఈ విషయాల్లో తాడో పేడో తేల్చుకుంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం గ్యారెంటీ. నూటికి నూరు శాతం.. చంద్రబాబు పార్టీ టీడీపీ అధికారంలోకి వస్తుంది. కానీ.. కొన్ని విషయాలను వెంటనే తేల్చేయాలి అని ఏకంగా పార్టీకి చెందిన సీనియర్ నేతలే చెబుతున్నారు. టీడీపీని వెంటాడే సమస్యలు ఏంటంటే.. ఫస్ట్ అధికార పార్టీ. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ చాలా బలంగా ఉండటం. రెండోది బలమైన సామాజిక వర్గం. ఈ రెండే టీడీపీని వెంటాడుతున్నాయి.
మరోవైపు సర్వేలు చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం చాలా కష్టం అని చెప్పడం లేదు కానీ.. వైసీపీ మాత్రం ఎలాగైనా 100 కు పైగా స్థానాల్లో గెలుస్తుందని చెబుతున్నారు. వైసీపీ వందకు పైగా స్థానాల్లో గెలిస్తే టీడీపీ పరిస్థితి ఏంటి. ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా. తెలుసు కానీ.. చంద్రబాబు బయటపడటం లేదు. అందుకే పార్టీ నేతలతోనూ ఆయన సమావేశం నిర్వహించి ఏం చేద్దామని సలహాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ అధికార పార్టీపై కత్తులు నూరుతున్నారు. కానీ.. అసలు టీడీపీలో ఏం సమస్యలు ఉన్నాయి అనేదానిపై మాత్రం చంద్రబాబు దృష్టి పెట్టడం లేదు అనే ఆరోపణలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. పార్టీలో చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తులు పెరిగిపోయారని తెలుస్తోంది. టికెట్ నీకా నాకా.. అన్నట్టుగా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కొట్టుకుంటున్నారట.

TDP : పార్టీలో అసంతృప్తులు పెరిగిపోయారా?
ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లకు టికెట్ కన్ఫమ్ అని చంద్రబాబు చెప్పినా సరే.. కొన్ని సిట్టింగ్ స్థానాల్లోనూ నేతలు గొడవ పెట్టుకుంటున్నారట. ఇక మిగితా స్థానాల్లో అయితే చంద్రబాబు కంటే ముందే నియోజకవర్గం స్థాయి నేతలు తమకంటే టికెట్ తమకు అంటూ వాళ్లలో వాళ్లే కొట్టుకొని పార్టీ పరువును బజారుకీడుస్తున్నారట. మరోవైపు పొత్తుల సమస్యలు. ఒకవేళ టీడీపీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లను ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో పార్టీలో అసంతృప్తులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, దీన్ని చంద్రబాబు ఎలా పరిష్కరించుకుంటారో అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి చంద్రబాబు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారో?