Chiranjeevi : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవిడ పెళ్లి విషయాలతో తెగ వార్తలలో నిలుస్తుంది. తొలుత శిరీష్ భరద్వాజ్ అనే ఒకరిని ప్రేమించి వివాహమాడిన తర్వాత అనూహ్య పరిస్థితులలో వీరు విడిపోయారు. కొద్ది రోజులకి మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ దేవ్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మెగా కుటుంబం సపోర్ట్ ఉండటంతో విజేత అనే సినిమాతో ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా హిట్ కాకపోయినా నటుడిగా కళ్యాణ్ దేవ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. మెగా కుటుంబం కావడంతో ఆయనకు వరుస సినీ అవకాశాలు లభించాయి.
సూపర్ మచ్చి, కిన్నెరసాని వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే కిన్నెరసాని సినిమా నేరుగా జీ 5 ద్వారా విడుదలైంది, సూపర్ మచ్చీ సినిమా సంక్రాంతికి ధియేటర్లలో విడుదలైంది కానీ ప్రమోషన్స్ కి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొద్ది రోజులగా వీరి విడాకుల విషయం వార్తలలో నిలుస్తుంది. ఇద్దరు విడిపోయారని, శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందని, అలానే కళ్యాణ్ దేవ్ కూడా మరో పెళ్లి చేసుకుంటున్నాడని ప్రచారాలు మొదలయ్యాయి.

Chiranjeevi : నిజమెంత..
తాజాగా.. సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ మూడవ పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తన సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఫోటో షేర్ చేస్తూ.. నా లైఫ్ ని మార్చేసిన కలల రాణి అని రాసుకొచ్చాడు. దీంతో మూడో పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వర్ణిక రాథోర్ కాగా, ఆమె హీరోయిన్ అని తెలుస్తుంది. అయితే ఈవిడ కళ్యాణ్ దేవ్ తదుపరి సినిమాలో కథానాయిక తప్ప ఆయ మరో పెళ్లి చేసుకోవడం లేదని కొందరు అంటున్నారు. ఏదేమైన ఈ ఇతగాడి పెళ్లి వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.