Raasi : తెలుగు సీనియర్ హీరోయిన్ రాశి గుర్తుందా? ఒకప్పుడు ఆమె తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే రాశి సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అప్పటి నుంచే తన కెరీర్ మొదలైంది. అయితే.. ఓ సినిమా కోసం రాశి.. నగ్నంగా నిలుచనుంది అనే వార్త ఒకప్పుడు సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ అయింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించిన రాశి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జగపతిబాబు, మోహన్ బాబు, వడ్డె నవీన్, శ్రీకాంత్ లాంటి చాలామంది హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రాశి. అప్పట్లో రాశి కూడా కొన్ని గ్లామర్ పాత్రల్లో నటించింది. అప్పుడు తను నటించిన గ్లామర్ సీన్లను చూసి కుర్రాళ్లు తట్టుకోలేకపోయారు.

Raasi : పోస్ట్ మేన్ సినిమాలో ఒంటి మీద బట్టలు లేకుండా చేసే సీన్ ఉందట
తను ఎన్నో సినిమాల్లో నటించినా.. గ్లామర్ పాత్రలు పోషించినా తను చేసిన ఓ సీన్ మాత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. అదే పోస్ట్ మేన్ సినిమా. ఆ సినిమాలో మోహన్ బాబు ముందు రాశి ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా అన్నం పెట్టే సీన్ అది. ఆ సీన్ లో రాశి ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా నటించినట్టు తెలుస్తోంది. ఆ సన్నివేశంలో మోహన్ బాబు కళ్లు మూసుకొని రాశిని చూడకుండా అన్నం తినాలి. అదే ఆ సీన్. అందులో రాశి నిజంగానే నగ్నంగా నటించిందని, కెమెరాలు కూడా రాశి వీపునే చూపించాయి కాబట్టి ముందు భాగం చూడలేదని, పూర్తిగా విప్పకపోయినా.. సగం న్యూడ్ గా తను నటించి ఉండొచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. సినిమా రిలీజ్ అయ్యాక.. ఆ సీన్ సినిమాకే హైలైట్ అయింది. అప్పట్లో జనాలు ఆ సీన్ గురించి చాలా రోజుల వరకు చర్చించుకున్నారు. ఆ సినిమా ఎలాగూ సూపర్ డూపర్ హిట్ అవడంతో రాశికి ఇంకా అవకాశాలు పెరిగాయి.