KCR : ఈ ఒక్క ప్రశ్నకీ సమాధానం చెప్తే నువ్వే ప్రైమ్ మినిస్టర్ వి కే‌సీ‌ఆర్

Advertisement

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలో అభివృద్ధిని పక్కన పెట్టి ఈ జాతీయ పార్టీ ఏంది.. పేరు మార్చడం ఏంది.. దేశ రాజకీయాలు అంటే అంత తమాషాగా ఉందా అంటూ నెటిజన్లు, ప్రజలు మండిపడుతున్నారు. కొందరు మాత్రం కేసీఆర్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. ఎప్పుడూ ఆ గుజరాత్ మోదీలు, నార్త్ ఇండియా వాళ్లే దేశాన్ని ఏలాలా.. సౌత్ ఇండియా ఏలకూడదా అంటూ కొందరు కేసీఆర్ కు సపోర్ట్ ఇస్తున్నారు. అయితే.. కొన్ని రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నాయి. కానీ..

Advertisement

బీజేపీ మాత్రం బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అవుతోంది. ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తోంది. 2001 లో టీఆర్ఎస్ పార్టీని పెట్టి తెలంగాణ ఉద్యయమే ధ్యేయంగా పార్టీ ముందుకు నడుస్తుందని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు జాతీయ రాజకీయాల కోసం ఏకంగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చడం ఏంటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా సీమాంధ్రకు చెందిన పలువురు మహనీయుల విగ్రహాలను కేసీఆర్ ధ్వంసం చేయించారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అలా వేరే రాష్ట్రాల మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేసిన కేసీఆర్ ఎలా జాతీయ నాయకుడు అవుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement
does kcr have answers for netizens questions
does kcr have answers for netizens questions

KCR : సీమాంధ్రకు చెందిన మహనీయుల విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేయించారు?

ఇప్పటికీ విభజన సమస్యలు పూర్తి కాలేదు. సీమాంధ్రులపై ఇప్పటికీ విషం చిమ్ముతున్నారు. ఇలాంటి వ్యక్తి జాతీయ భావనలు ఉన్నట్టు ఎలా చెప్పుకుంటారు అంటూ నెటిజన్లు స్పందిస్తుండటంతో కేసీఆర్ జాతీయ పార్టీపై చాలామందికి అనుమానాలు కలుగుతున్నాయి. కరోనా కాలంలోనూ రాష్ట్ర సరిహద్దు వద్ద అంబులెన్స్ లను ఆపేసి హైదరాబాద్ కు రాకుండా అడ్డుకొని వందల మంది కరోనా రోగులు చనిపోవడానికి కారణం అయిన కేసీఆర్ ఎలా జాతీయ వాది అవుతారు అని అసలు పాయింట్స్ పట్టుకొని ప్రశ్నిస్తున్నారు. మరి.. వీటిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement