Flipkart : ఆగస్ట్ నుండి మొదలు పెడితే వరుస పండుగలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఈ కామర్స్ సంస్థలు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ సేల్ నిర్వహించబోతుంది. ఈ సేల్ భారీ ఆఫర్స్ ఉండబోతున్నాయి. స్మార్ట్ ఫోన్స్‌తో పాటు ఇతర వస్తువులపై కూడా ఈ సేల్ ఉండబోతుందని సమాచారం. బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం ప్రత్యేకమైన పేజ్‌ను క్రియేట్ చేసిన అందులో తేదీలు ఏమి ప్రకటించలేదు. బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, కొన్ని డీల్స్‌ను వెల్లడించింది. ఎప్పటిలాగానే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఓ రోజు ముందుగానే సేల్ ప్రారంభమవుతుంది. దసరా సందర్భంగా ఈ బిగ్ సేల్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది.
Flipkart : భారీ ఆఫర్స్..
ఈ బిగ్ డే సేల్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనుండగా, ట్రిమ్మర్లపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని వెల్లడించారు. ఇంకా స్క్రీన్ కార్డులు రూ.99 నుంచే ప్రారంభం కానున్నాయి. గేమింగ్ ల్యాప్ టాప్ లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉండనున్నాయి. ప్రింట్లరు, మానిటర్లపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలు రూ.8,999 నుంచే ప్రారంభం కానున్నాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఐరన్ బాక్స్ లు రూ.299 నుంచే ప్రారంభం కానున్నాయి. ఏసీలపై 55 శాతం తగ్గింపులు ఉంటాయి. బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్లను భారీ తగ్గింపు ధరకు తీసుకురానున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

సామ్సంగ్, యాపిల్, రియల్మీ, వివో, ఒప్పో, మోటోరోలా, పోకో, ఇన్ఫినిక్స్తో పాటు మిగిలిన బ్రాండ్స్ స్మార్ట్ఫోన్లు కూడా తగ్గింపు ధరతో ఈ సేల్‌లో లభించనున్నాయి. ఫ్యాషన్ వస్తువులపై ఏకంగా 60-90 శాతం డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. మహిళల డ్రెస్ లు, జీన్స్ పై 90 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఇంట్లో ఉండే కిచెన్ వస్తువులపై కూడా ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించబోతుంది. కిచెన్ వస్తువులపై 50-80 శాతం డిస్కెంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఫర్నీచర్ పై 85 శాతం వరకు తగ్గింపులు లభించనున్నాయి. ఇలా పలు వస్తువులపై భారీ డిస్కౌంట్స్ ఉంటాయని తెలుస్తుండగా, యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్, క్రెడిట్ , డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్లు లభించనున్నాయి.