GodFather : ఫస్ట్ వీకెండ్ అయ్యింది .. అఖండ ఎక్కువా ? గాడ్ ఫాదర్ ఎక్కువా ?

Advertisement

GodFather : చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశారు. మరోసారి బాక్సాపీస్ రూలర్ గా మారిపోయారు చిరు. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన గాడ్ ఫాదర్ సూపర్ డూపర్ హిట్ తో.. రికార్డులు తిరగరాస్తున్నారు. మొదటి రోజు నుంచే భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అయిన గాడ్‌ ఫాదర్ మూవీ.. పాజిటివ్‌ టాక్ తో దూసుకుపోతోంది. మలయాళ లూసీఫర్ రిమేక్‌ గా తెరకెక్కిన సినిమా.. ఆ సినిమా కంటే బెటర్ గా ఉందనే టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు.. జస్ట్ రిలీజ్‌ అయిన ఒక్క రోజులోనే వరల్డ్ వైడ్‏గా 38 క్రోర్ గ్రాస్‌ను కలెక్ట్ చేసి.. అందర్నీ షాక్ చేసింది. ఇక ఇప్పుడు 100 మార్క్‌ను టచ్ చేసింది. రూ.100 కోట్ల క్లబ్‌లోకి చిరు ఫిల్మ్ గాడ్ ఫాదర్ ఎంటరైపోయింది.

Advertisement

మరోవైపు వీకెండ్‏లో కలెక్షన్స్ సునామీ సృష్టించింది. శుక్రవారం వరకు రూ. 70 క్రోర్ గ్రాస్ వసూలు చేసిన చిరు గాడ్‌ ఫాదర్.. ఇదే గ్రేస్‌తో బాక్సాఫీస్‌ రేంజ్‌ను 100 వరకు చేర్చింది. చేర్చడమే కాదు.. రూ.150 కోట్ల దిశగా పరుగెడుతోంది. ఐదవ రోజు ఏకంగా దేశవ్యాప్తంగా రూ. 9 కోట్లు వసూలు చేసింది గాడ్ ఫాదర్. అక్టోబరు 9న, గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలను వసూలు చేసిందని నిర్మాతలు ధృవీకరించారు. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, గాడ్ ఫాదర్ ఆదివారం భారతదేశంలో రూ. 9 కోట్లు వసూలు చేసింది.

Advertisement
god father collections
god father collections

GodFather : అఖండ vs గాడ్ ఫాదర్

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.7 కోట్లు రాగా.. రెండవ రోజు రూ. 7.73 కోట్లు రాబట్టింది. ఇక మూడవ రోజు రూ. 5.41 కోట్లు.. నాల్గవ రోజు రూ. 5.62 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఐదవ రోజు కేవలం తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‏లో రూ. 5.23 కోట్లు అందుకుంది. మొత్తం ఐదు రోజులలో తెలుగు రాష్ట్రాల్లో రూ. 39.96 కోట్లు. గ్రాస్.. రూ. 61.20 కోట్లు వచ్చాయి. అల నార్త్ లో రూ. 4.61 కోట్లు అందుకుంది. ఓవర్సీస్ లో రూ. 4.30 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 50.11 కోట్లు షేర్స్ రాబట్టడమే కాకుండా రూ. 91 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో గాడ్ ఫాదర్ చిత్రాన్ని పోల్చుతున్నారు అభిమానులు. ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే విడుదలైన మొదటిరోజే అఖండ సినిమా రూ. 15.39 కోట్లు వసులు చేయగా.. రూ. 23 కోట్లు గ్రాస్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.18.74 కోట్లు వసూళు చేయగా.. రూ. 29.5 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక గాడ్ ఫాదర్ మాత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.7 కోట్లు రాబట్టింది. అంటే అఖండ సినిమా కంటే గాడ్ ఫాదర్ చిత్రమే మొదటి రోజు ఎక్కువ వసూలు చేసింది.

Advertisement