Sundar Pichai : గూగుల్ కంపెనీ ఈ మధ్య బాగా కమర్షియల్ అయిపోయిందా? కనీసం ఉద్యోగులకు ఎంటర్ టైన్ మెంట్ లేకుండా, ట్రావెల్ లాంటి సౌకర్యాలను కూడా కట్ చేసిందా? దీనిపై గూగుల్ ఉద్యోగులు ఏకంగా ఆ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ కే మెయిల్స్ పెట్టారు. నిజానికి.. కంపెనీ ఉద్యోగులకు ట్రావెల్, ఎంటర్ టైన్ మెంట్ కోసం కంపెనీ కొంత బడ్జెట్ ను కేటాయిస్తుంది. ఇప్పుడు ఆ బడ్జెట్ ను తగ్గించిందట. దీంతో ఉద్యోగులు ఏకంగా కంపెనీ సీఈవోకే ఈ విషయంపై మొర పెట్టుకున్నారట.
దీంతో ఉద్యోగులకు సుందర్ పిచాయ్ ఇచ్చిన రిప్లయికి ఉద్యోగులు షాక్ అయినట్టు తెలుస్తోంది. డబ్బులు, కాలక్షేపం కోసం చేసే ట్రావెలింగ్, ఎంటర్ టైన్ మెంట్ (పెర్క్స్) శాశ్వతం కాదు. మీ పనిలోనే ఫన్ ను వెతుక్కోండి.. అంటూ ఉద్యోగుల బెనిఫిట్స్ పై అలా స్పందించారట సుందర్. గూగుల్ కంపెనీ ఈ మధ్య హైరింగ్ ప్రాసెస్ ను తగ్గించింది.

Sundar Pichai : హైరింగ్ ప్రాసెస్ ను ఆపేసిన గూగుల్
దీనిపై సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. గూగుల్ ఇప్పుడు చాలామంది ఉద్యోగులను కలిగి ఉంది. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నా అది ప్రొడక్టివిటీ మీద పడకూడదు కదా. 20 మంది టీమ్ అయినా.. 100 మంది టీమ్ అయినా అది ప్రొడక్టివిటీ మీద పడకూడదు. గూగుల్ చిన్న కంపెనీగా ఉన్నప్పుడు, స్క్రాప్ గా ఉన్నప్పటి విషయాలను నేను ఇంకా గుర్తుంచుకున్నా. అందుకే.. మనం డబ్బులను ఫన్ తో ముడిపెట్టకూడదు.. అంటూ గూగుల్ ఉద్యోగుల మీటింగ్ లో సుందర్ పిచాయ్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.