Guppedantha Manasu 10 Oct Today Episode :బుల్లితెరపి ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 577 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జగతి వసుధారపై మండిపడుతూ వస్తువులన్ని ఇసురుతు ఉంటుంది. అంతలో మహేంద్ర అక్కడికి వచ్చి ఏం జరిగింది ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జగతి జీవితాలే నాశనం అవుతున్నాయి మీరు చేసే తప్పులకి అని కోప్పడుతూ ఉంటుంది. నేను 20 సంవత్సరాలుగా ఆ ఇంట్లోకి ఎందుకు రాలేదు ఎందుకంటే రిషి మనసేంటో నాకు తెలుసు రిషి బాధపడకూడదు అని 20 సంవత్సరాలు కూడా నేను ఆ ఇంటికి రాలేదు కానీ మీరు ఇప్పుడు అదే పని మళ్ళీ చేస్తున్నారు. రిషి ని బాధ పెడుతున్నారు అని వసుధార మహేంద్ర పై మండిపడుతూ ఉంటుంది. నన్ను అమ్మ అని పిలవలేక తన ప్రేమను కూడా వదులుకున్నాడు.. అది మీకు అర్థం కావడం లేదా అనగానే వాసుధార మేడం నేను చెప్పేది వినండి అనగానే నాకేం చెప్పొద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది.
ఇప్పుడు మహేంద్ర వసుధారని అక్కడ నుంచి పంపించేస్తుంది. అప్పుడు జగతి నేను తల్లిగా ఓడిపోయాను నేనేం తల్లిని అని మహేంద్రతో చెప్పుతూ కళ్ళ తిరిగి కిందపడిపోతుంది. ఇక మహేంద్ర తనని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఆ విషయం ధరణి ఋషికి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు రిషి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ధరణి అప్పుడు ఇప్పుడే డాక్టర్ వచ్చారు చూస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు సరే నేను వస్తున్నాను అని చెప్తాడు.ఇక డాక్టర్ జగతిని చూస్తూ ఇది సైక్లాజికల్ ప్రాబ్లం ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయి అలా కళ్ళు తిరిగి పడిపోయారు అని నేను ఇంజక్షన్ వేసాను ఏం కాదు అని చెప్తుంది. ఇక అప్పుడు మహేంద్ర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అనగానే.. తనని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్. అప్పుడు దేవయాని డాక్టర్ని ఆవిడకి ఏమైంది. ఉంటారా.. పోతారా.. అని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ అదేంటండి అలా మాట్లాడతారు ఆవిడ బాగానే ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అంతలో మహేంద్ర వచ్చి ధరణిని ఒక గ్లాస్ పాలు కలిపి తీసుకొని రా అని చెప్తాడు. ఇక దేవయాని నాక్కూడా ఒక స్ట్రాంగ్ టీ అని వెటకారంగా ధరణిని అడుగుతుంది.

కట్ చేస్తే రిషి వసుధార దగ్గరికి వచ్చి ఏమైంది జగతి మేడం ఎందుకు కింద పడిపోయారు అనగానే వసుధర ఆశ్చర్యపోతూ… కంగారుపడుతూ జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రిషి మీ మేడం మనసులో ఏముందో నాకు తెలియదు కానీ నా మనసులో ఏముందో నీకు చెప్పేశాను రా ఇద్దరం కలిసి ఇంటికెళ్దాం అని చెప్తాడు. కట్ చేస్తే జగతికి టాబ్లెట్లు ఇస్తూ జగతికి ధైర్యం చెబుతూ టెన్షన్ పడకు అని అంటూ ఉంటాడు. ఇకనుంచి ఏ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు జగతి అంటుండగా… గౌతం కూడా వచ్చి అదే చెప్తూ ఉంటాడు. దేవయాని రిషి వసుధారాల గురించి ఆలోచిస్తూ ఉండగా… వసుధారా రిషి దండలు మార్చుకొని వచ్చినట్లుగా ఊహలో ఊహించుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు రిషి వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ అనగానే బ్రమలోంచి బయటికి వచ్చి మీ దండలు అని అంటుంది. అప్పుడు దండలు ఏంటి పెద్దమ్మ అనగానే ఏం లేదులే అని దేవయాని అని అంటుంది. అప్పుడు రిషి తనకు ఏమైంది అని అనగానే ఏం లేదు చిన్న నీరసం అని చెప్తుంది.
అప్పుడు రిషి తనని జాగ్రత్తగా చూసుకో పెద్దమ్మ అని చెప్తుంటాడు. ఇక వసుధార జగతి మేడం దగ్గరికి వెళ్తుంది. అప్పుడు జగతి రా వసు అని అంటూ మీరు బాగానే ఉన్నారా అని వసుని అంటూ ఉంటుంది. అప్పుడు వసుధార నీకు ఎలా ఉంది మేడం అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు జగతి రిషి కోపం తగ్గిందా మీరిద్దరూ మంచిగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వసుధార రిషి సార్ కోపం పాలు నీళ్ల లాంటివి అది మనం విడదీయలేం అని చెప్తూ.. ముందు మీరు జ్యూస్ తాగండి అని జ్యూస్ తాగిస్తూ మీరు ఇలా బెడ్ మీద పడుకోవడం అసలు బాలేదు అంటూ ఉంటుంది. అప్పుడు జగతి నేను తల్లిగా ఎప్పుడు ఓడిపోతూనే వస్తున్నాను అంటుంది. ఆ మాటలన్నీ బయట నుంచి రిషి ఇంటూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే.